Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. పెట్రోల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-16T12:08:17+05:30 IST

సోషల్ మీడియాలో (Social Media) ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. పెట్రోల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..!

Viral Video: సోషల్ మీడియాలో (Social Media) ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సరదా కోసం చేసినవి అయితే, మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉంటే.. మరికొన్ని తమ తేలివి తేటలతో కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసినవి ఉంటాయి. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన తేలివితో ఓ అద్భుతాన్నే సృష్టించాడు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులను తగ్గించుకునే దిశగా అతడు ఈ అద్భుత ఆవిష్కరణను గావించడం విశేషం. ఆ ఆవిష్కరణ తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతోంది (Video goes Viral). వీడియో చూసిన నెటిజన్లు వారెవ్వా.. ఏం ఐడియా గురూ..! అంటూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇంతకీ ఆ వ్యక్తి సృష్టించిన అద్భుతం ఏంటో తెలుసా? తన స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌ను (Splendor Motorcycle) మాడిఫై చేసి ఎలక్ట్రిక్ బైక్‌గా (Electric Bike) మార్చేయడమే. అవును మీరు విన్నది నిజమే. పెట్రోల్ బండికి నాలుగు బ్యాటరీలు, ఓ ప్రత్యేక మోటార్ అమర్చి ఎలక్ట్రిక్ బండిగా మార్చేశాడు మనోడు. దాంతో ఇప్పుడు పెట్రోల్ అవసరం లేకుండానే తన బైక్ నడుస్తున్నట్లు చెబుతున్నాడు. ఇలా ఆ మాడిఫయిడ్ బైక్ తాలూకు వీడియోను punjab_vibe_1313 అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటివరకు వీడియోకు దాదాపు 3లక్షల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'పెట్రోల్ సేవ్ చేయడానికి అద్భుతమైన ట్రిక్' అని ఒకరు, 'ఇదో జనరేటర్ బైక్‌గా మారింది' అని మరోకరు కామెంట్ చేశారు. చాలా మంది నెటిజన్లు మాత్రం 'వారెవ్వా.. ఏం ఐడియా గురూ..!' అంటూ ఆ వ్యక్తిని పొగడుతున్నారు.

Viral Video: యజమాని అదే పనిగా తిడుతున్నా సైలెంట్‌గా ఉన్న శునకం.. సడన్‌గా అతడు చెప్పు తీసుకుని కొట్టబోతోంటే..!


Shruti Haasan: శృతి మించి పోయిన శృతి.. బాబోయ్ ఈ రేంజ్‌లో గ్లామర్ ఫొటోలా..!

Updated Date - 2023-05-17T13:03:20+05:30 IST