Police Tiger..: జూదరులు కత్తులు చూపించారు.. మెట్లపైకి తోసేశారు..
ABN , First Publish Date - 2023-08-08T12:26:12+05:30 IST
పేకాట స్థావరాలపై దాడి చేసిన డీఎస్పీ ఉమారాణి(DSP Umarani) పోలీస్ టైగర్‌లా విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి
- అయినా వెంటపడి వేటాడిన ట్రైనీ డీఎస్పీ ఉమారాణి
- బళ్లారిలో సంచలనం రేపిన చేజింగ్..
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): పేకాట స్థావరాలపై దాడి చేసిన డీఎస్పీ ఉమారాణి(DSP Umarani) పోలీస్ టైగర్‌లా విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి కౌల్ బజార్ అదీ హైద్రాబాద్ పాతబస్తీని తలపిస్తుంది. అక్కడ పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ట్రైనింగ్ డీఎస్పీగా బళ్లారి కౌల్‌బజార్ పోలీస్టేషన్‌కు వచ్చిన ఉమారాణి పోలీస్ పవర్ ఏమిటో చూపించింది. ఎస్పీ రంజిత్ కుమార్ డైరెక్షన్‌లో ఉమారాణి సినిమా కథను తలపించేలా జూదరులను పట్టుకోవడం నగరంలో చర్చనీయాంశమయ్యింది.
- బళ్లారి కౌల్‌బజార్ ప్రాంతంలో సలీం వీధిలోని ఒక సంధులో ఇమ్రాన్ అలియాస్ అక్షయ్ అనే వ్యక్తి నేతృత్వంలో పేకాట(అందర్ బహార్) జూదం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. అతను ఓ నేతకు అత్యంత సన్నిహితుడు. చాలా ఏళ్లుగా పేకాట తన ఇంటి పైనే అడిస్తున్నాడు. అప్పుడప్పుడూ పోలీసులు దాడులు జరిపేందుకు వెళ్లినా లెక్క చేయకుండా, తప్పించుకుని వెళ్లేవాడు. కానీ ఎస్పీ డైరెక్షన్‌లో పక్కా ప్లాన్‌తో దొరికిపోయాడు.
- అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభం అయ్యింది. ఇమ్రాన్ అలియాస్ అక్షయ్ ఇంటికి పోతే పోలీసులకు దొరకడం కష్టం. లేదా పోలీసులు ఎక్కువ మంది పోయినా జూదర్లు పారిపోతారు. అదే ఆలోచనతో డీఎస్పీ ఉమాదేవి సాధారణ మహిళలా చీరకట్టి కౌల్‌బజార్ వీధుల్లోకి చేరుకుంది. ఆమె వెంట ఓ కానిస్టేబుల్ ఆ బజార్‌లో ఏదో వస్తువు కొనేలా చేరుకున్నారు. మిద్దెపై జరుగుతున్న విషయాన్ని గమనించి ఎస్పీకి సున్నితంగా పోలీస్ కోడ్ బాషలో ఎస్‌ఎంఎస్ చేసింది. పేకాట ఆడుతున్న వారు పారి పోకుండా గేటు వేసే ప్రయత్నం చేసింది. దీన్ని గమనించని పేకాట గుంపు ఎవరో ఆడవాళ్లులే అనుకుని నిర్లక్ష్యంగా ఉన్నారు.
- అయితే అక్కడికి వెళ్లిన డీఎస్పీని జూదర్లు ఎవరు మీరు అని అడిగి ఆమెను మెట్టు నుంచి కిందకు తోశారు. దాదాపు 5 మెట్ల వరకూ కాలు జారి పొర్లుకుంటూ కింద పడింది. చేతికి ,కాలికి తలకు గాయాలు అయ్యాయి. ఆమెను చంపేందుకు వారి వద్ద ఉండే లాంచల్ కొడవలి తీశారు. అయినా భయపడలేదు..ఆమె కూడా చీర నడుం వద్ద చిక్కించుకున్న సర్వీస్ రివాల్వర్ తీయడంతో జూదర్లు కొంత తగ్గారు. అయితే దాదాపు 7 మంది జూదర్లు ఆమె పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆమె ధైర్యంగా జూదర్లను పట్టుకుని, పోలీసులను రప్పించింది.
- ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎస్పీ గమనిస్తున్నారని డీఎస్పీ ఉమా తెలిపారు. ఉమాదేవితో పాటు ఉండే మహిళ కానిస్టేబుల్ వరలక్ష్మికి కూడా కొద్దిగా గాయాలయ్యాయి. మొత్తం మీద ఇద్దరు మహిళా పోలీసులు జూదర్లు కత్తులతో బెధరించినా భయపడకుండా తిగరుగుబాటు చేసి పట్టుకోవడం పోలీస్ శాఖకే గర్వకారణం అని ఎస్పీ పేర్కొన్నారు. పాత పోలీసులను పంపితే జూదర్లు గుర్తించి తప్పించుకుంటారనే ట్రైనీలో ఉన్న డీఎస్పీని రంగంలోకి దింపామని ఎస్పీ తెలిపారు.