Viral Video: విషం ఉండదని కొండచిలువను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:35 PM
పాములు ఎంత ప్రమాదకరమైనా వాటి జోలికి పోనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగే కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. ఒక్కసారి మనిషిని కానీ జంతువులను కానీ చుట్టేసిందంటే మాత్రం దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయినా...
పాములు ఎంత ప్రమాదకరమైనా వాటి జోలికి పోనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగే కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. ఒక్కసారి మనిషిని కానీ జంతువులను కానీ చుట్టేసిందంటే మాత్రం దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయినా కొందరు వాటితో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విషం ఉండదని ఓ వ్యక్తి ఏకంగా కొండచిలువను పట్టుకుని ముద్దు పెట్టాడు. చివరకు దాని రియాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కొండచిలువ ఇళ్ల సమీపంలోకి రావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఓ వ్యక్తి మాత్రం దాన్ని పట్టుకోవడమే కాకుండా ఏకంగా పైకి ఎత్తుకుని అందరికీ అవగాహన కల్పించడం మొదలెట్టాడు. కొండచిలువకు విషం ఉండదని, ప్రమాదమేమీ కాదని చెబుతూనే దాన్ని తలను పట్టుకుని ఏకంగా (man kissed the python) ముద్దు కూడా పెట్టేశాడు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సైలెంట్‍గా ఉన్న కొండచిలువు ఒక్కసారిగా చెలరేగిపోయింది. ఒక్కసారిగా నోటితో అతడి దవడను పట్టేసుకుంది.
ఊహించనివిధంగా కొండచిలువ కొరికేయడంతో సదరు వ్యక్తి ఖంగుతిన్నాడు. దాన్నుంచి విడిపించుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు. అయినా కొండచిలువ మాత్రం అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఇలా చాలా సేపటి తర్వాత దాన్ని ఎలాగోలా గట్టిగా పక్కకు లాగేశాడు. ఇలా ప్రమాదం నుుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విషం లేదు కదా అని పిచ్చివేషాలు వేస్తే.. ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు, షాకింగ్ ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.