SS Rajamouli Request: అంతర్జాతీయ వేదికపై రాజమౌళి విన్నపం.. అదేంటంటే..
ABN , First Publish Date - 2023-02-25T14:30:40+05:30 IST
ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రం అంతర్జాతీయ వేదికపై విజయ కేతనం ఎగురవేస్తోంది. మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్(golden globe), నేడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రం అంతర్జాతీయ వేదికపై విజయ కేతనం ఎగురవేస్తోంది. మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్(golden globe), నేడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో (hollywood critics association awards) ఒకటి కాదు రెండు ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ స్టంట్స్(Best stunts)’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’(natu natu), ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ ఇలా పలు విభాగాల్లో ‘బ్లాక్ పాంథర్’, ‘ది వుమెన్ కింగ్’, ‘ది బ్యాట్ మ్యాన్’ వంటి విదేశీ చిత్రాలను పక్కకు నెట్టి విజయం సాధించింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ‘హెచ్‌సీఏ స్పాట్‌లైట్’ అవార్డును సైతం ఇది దక్కించుకుందీ చిత్రం. అవార్డులు అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడారు.
‘‘ఆర్‌ఆర్‌ఆర్’కు బెస్ట్ స్టంట్స్ అవార్డును అందించిన హెచ్‌సీఏ జ్యూరీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా యాక్షన్ టీమ్ ఎంతగానో శ్రమించి స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. అందులో కీలకమైన వ్యక్తి సాల్మన్. సినీ ప్రియులను అలరించడం కోసం స్టంట్ మాస్టర్స్ ఎంతో కష్టపడుతుంటారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందించే బృందాలకు నాది ఒక చిన్న విన్నపం. ఇకపై మీ అవార్డులు జాబితాలో స్టంట్ కొరియోగ్రాఫర్స్ (Rajamouli request to Awards associations) విభాగాన్ని కూడా చేర్చాలని సభాముఖంగా కోరుతున్నాను. ఈ చిత్రంలో రెండు, మూడు షాట్స్‌లో మాత్రమే డూప్స్‌ని ఉపయోగించాం. మిగతావన్నీ ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్వయంగా చేశారు. ఇది కేవలం నాకు, నా చిత్రానికే కాదు మా భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహాన్’’ అని అన్నారు. (Rajamouli thanks to HCA)
‘హెచ్.సి.ఎ’ స్పాట్‌లైట్ అవార్డు అందుకున్న రాజమౌళి ‘‘మా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కథా రచయిత, మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్. సంగిత దర్శకుడు, మా అన్నయ్య ఎం.ఎం.కీరవాణికి కృతజ్ఞతలు. అలాగే, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ రామ, ఇతర టీమ్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అలాగే అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్, కొమురం భీమ్‌గా నటించిన తారక్ మూడేళ్ళు ఈ సినిమా కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించారు’’ అని చెప్పారు.