Rakesh Master : కంటతడి పెట్టిస్తున్న రాకేశ్ మాస్టర్ వీడియో.. శిష్యుడితో ఏం చెప్పారో విన్నాక..
ABN , First Publish Date - 2023-06-18T21:15:13+05:30 IST
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master)కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాకేశ్ చనిపోయారని తెలుసుకున్న అభిమానులు, సోషల్ మీడియా (Social Media) ఫాలోవర్లు కన్నీరుమున్నీరవుతున్నారు..
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master)కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాకేశ్ చనిపోయారని తెలుసుకున్న అభిమానులు, సోషల్ మీడియా (Social Media) ఫాలోవర్లు కన్నీరుమున్నీరవుతున్నారు. మాస్టర్ మాట్లాడిన పాత వీడియోలు, ఇంటర్వ్యూల్లో ఎమోషనల్‌గా మాట్లాడినవాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వీరాభిమానులు, నెటిజన్లు ‘మిస్ యూ మాస్టర్’.. ‘RIP మాస్టర్’ భావోద్వేగానికి లోనవుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో (Twitter) రాకేశ్ మాస్టర్‌కు చెందిన వీడియోలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ వీడియోలన్నింటిలో కల్లా తన శిష్యుడు పుల్లయ్య అలియాస్ జూనియర్ రాకేశ్ మాస్టర్‌తో (Jr Rakesh Master) ఆయన మాట్లాడిన వీడియోను చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. రెండు వారాల క్రితం పుల్లయ్యను కలిసి రాకేశ్ మాస్టర్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు.
ఏం మాట్లాడారు..?
‘నీతో మాట్లాడాలని ఉంది రా.. ఈ అద్దాలు నువ్వు పెట్టుకో.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. (ఏడుస్తూ) నాకు తెలుసు. నీ శరీరంలో పటిష్టమైనది ఉంది. నాకు తెలుసు.. నేను అన్నీ చూస్తున్నా. నువ్వు ఉదయించే సూర్యుడివి.. నేను అస్తమించే సూర్యుడిని.. అన్నీ తెలుసు. అన్నీ తిరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంట్రా..? అంటే నాకు జన్మనిచ్చిన తండ్రి మీరు.. మా అమ్మగారు కానీ.. మీరుగానీ.. మీ తర్వాతే ఎవరైనా. మీ అమ్మగారిని.. అదే మా వదినమ్మగారిని జాగ్రత్తగా చూసుకో’ అని పుల్లయ్యకు రాకేశ్ మాస్టర్ చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాం మాస్టర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీరు చనిపోయారంటే అస్సలు నిజం అనిపించట్లేదు మాస్టర్ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు.
వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
ఎవరీ పుల్లయ్య..?
పుల్లయ్య కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన కుర్రాడు. డ్యాన్స్ అంటే ఇష్టంతో హైదరాబాద్‌కు (Hyderabad) వచ్చి రాకేశ్ మాస్టర్ దగ్గరికి వెళ్లాడు. పుల్లయ్యను అక్కున చేర్చుకున్న మాస్టర్.. అతనికి మూమెంట్స్ డ్యాన్స్ నేర్పించాడు. అప్పట్లో ఈ ఇద్దరి మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో (Youtube) కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలు బాగా వైరల్ అవ్వడమే కాదు.. ట్రోల్ కూడా అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. మాస్టర్‌ను కాదని, వదిలేసి బయటికొచ్చాడు పుల్లయ్య. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాకేశ్ మాస్టర్‌ను తిట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ తాగేసి.. ఇష్టం వచ్చినట్లు తిడతాడని.. అవన్నీ భరించలేక మాస్టర్‌ను వద్దనుకొని వచ్చేసినట్లు చెప్పుకొచ్చాడు. రాకేశ్ సార్‌కు డ్యాన్స్ అస్సలు రాదని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం రచ్చ రచ్చ అయ్యింది. అంతకుముందు రాకేశ్ మాస్టర్ లాగే హెయిర్ కటింగ్ చేసుకొని.. అచ్చం అలాగే డైలాగ్స్ పలుకుతూ కామెడీ చేస్తూ వీడియోలు కూడా పుల్లయ్య చేశాడు. ఓ కామెడీ షోలో కూడా తన మాస్టర్‌లాగే కామెడీ చేసి అందర్నీ పుల్లయ్య మెప్పించాడు.
ఈ మధ్యనే తన శిష్యుడిని రాకేశ్ మాస్టర్ కలిశారు. ఏమేం మాట్లాడుకున్నారో తెలియట్లేదుకానీ.. ఒక్కసారిగా మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. RIP Master అని.. ఓం శాంతి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క వీడియోనే కాదు ట్విట్టర్‌లో రాకేష్ మాస్టర్ ఎమోషనల్ అయిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలానే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.