Ram charan: ఆ విషయం మొదట తారక్‌కే చెప్పా!
ABN , First Publish Date - 2023-02-23T15:08:38+05:30 IST
రామ్‌చరణ్-తారక్ స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి రాజమౌళి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
రామ్‌చరణ్ (Ram charan)-తారక్ (NTR) స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి రాజమౌళి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తన జీవితంతో ఎంతో ఆనందించే విషయాన్ని తొలుత తారక్‌తోనే చెప్పానని రామ్‌చరణ్ చెప్పారు. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో (RRR) తారక్‌పై తనకున్న అభిమానం, స్నేహం గురించి చెప్పుకొచ్చారు. ‘‘తారక్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య వ్యక్తిగత విషయాలు ఏమీ ఉండవు ఏదైనా షేర్ చేసుకుంటాం. నేను తండ్రిని కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందు మొదట ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి నా ఆనందాన్ని షేర్ చేసుకున్నాను. మెగా ఫ్యామిలీలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు అమ్మ, నాన్న చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. హెచ్.సి.ఎ. సంస్థ ఆయన్ని ఆహ్వానించింది. శుక్రవారం ఈ వేడుక జరగనుంది. విజేతల్లో ఒకరికి రామ్ చరణ్ చేతుల మీదగా అవార్డు ఇవ్వనున్నారు. హెచ్.సి.ఎ. అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నాలుగు విభాగాల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే! (Ram Charan and Taran Friendship and bonding)