Anjali Bhimani to Ram charan: 8 వేల మైళ్ల నుంచి వచ్చారా?

ABN , First Publish Date - 2023-02-25T15:39:12+05:30 IST

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌ వేదికపై రామ్‌చరణ్‌ చేతుల మీదుగా అమెరికన్‌ నటి యాంజలీ భీమాని అవార్డు అందుకున్నారు. బెస్డ్‌ వాయిస్‌ మోషన్‌ క్యాప్చర్‌ విభాగంలో అవార్డ్‌ అందుకున్న ఆమె రామ్‌చరణ్‌తో సరదాగా మాట్లాడారు.

Anjali Bhimani to Ram charan: 8 వేల మైళ్ల నుంచి వచ్చారా?

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌ (Hollywood Critics Association awards) వేదికపై రామ్‌చరణ్‌ చేతుల మీదుగా అమెరికన్‌ నటి యాంజలీ భీమాని (Anjali bhimani)అవార్డు అందుకున్నారు. బెస్డ్‌ వాయిస్‌ మోషన్‌ క్యాప్చర్‌ (best Voice motion Capture) విభాగంలో అవార్డ్‌ అందుకున్న ఆమె రామ్‌చరణ్‌తో సరదాగా మాట్లాడారు. ‘‘చరణ్‌ (Ram charan) మీరు ఇండియా నుంచి బెస్డ్‌ వాయిస్‌ మోషన్‌ క్యాప్చర్‌ అవార్డ్‌ నాకు అందించడం కోసం 8000 మైళ్ల నుంచి వచ్చారట. నిజంగా అంత దూరం నుంచి వచ్చిన స్టార్‌ పక్కన నిలబడి అవార్డ్‌ అందుకోవడం ‘ఇదీ నిజమైన అవార్డ్‌ విన్నింగ్‌ మూమెంట్‌ అంటే’. నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి పెద్ద ఫ్యాన్‌ని. ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

2.jpg

అందుకు బదులుగా రామ్‌చరణ్‌ ‘అవును నేను యాంజలీతో ఫొటో కోసం ఇంత దూరం వచ్చాను. కానీ సెల్ఫీ అడిగే విషయంలో కాస్త లేట్‌ చేశాను’’ అని చెర్రీ చమత్కరించారు. వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-02-25T15:50:10+05:30 IST