Share News

Roti Making Mistakes: చపాతీ పిండిని కలిపేటప్పుడు.. చాలా మంది తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్స్ ఇవే..!

ABN , First Publish Date - 2023-11-07T11:46:47+05:30 IST

చపాతీ చేయడానికి వినియోగించే పిండి దగ్గరనుండి, పిండి కలపడం, చపాతీలు చేయడం, వాటిని నిల్వచేయడం ఇలా చాలా విషయాలలో తెలియకుండానే తప్పులు చేస్తున్నారు.

Roti Making Mistakes: చపాతీ పిండిని కలిపేటప్పుడు.. చాలా మంది తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్స్ ఇవే..!

భారతీయులు ఎక్కువగా తినే ఆహారంలో చపాతీలు ముఖ్యమైనవి. నార్త్ ఇండియన్స్ అయితే ప్రతిరోజూ తప్పనిసరిగా చపాతీలు తింటారు. ఇక దక్షిణాది రాష్ట్రాలలో కూడా చపాతీలను భోజనంతో, టిఫిన్స్ గానూ తింటారు. అయితే చపాతీ చేయడానికి వినియోగించే పిండి దగ్గరనుండి, పిండి కలపడం, చపాతీలు చేయడం, వాటిని నిల్వచేయడం ఇలా చాలా విషయాలలో తెలియకుండానే తప్పులు చేస్తున్నారు అధికశాతం మంది(chapati making mistakes). దీనివల్ల చాలారకాల నష్టాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. చపాతీ తయారీలో చేస్తున్న పొరపాట్లు, చేసుకోవలసిన మార్పుల గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పిండి కలపడం..(dough making)

చపాతీలు చేయడానికి పిండిని కలిపిన తరువాత చాలామంది ఆ కలిపిన పిండిని అలాగే ఒకవైపు ఉంచేస్తుంటారు. మరికొందరు పిండి కలిపిన వెంటనే చపాతీలు చేస్తుంటారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే.. పిండి కలిపిన తరువాత దాన్ని కొద్దిసేపు అలాగే ఉంచేయాలి. ఇలా చేస్తే పిండిలో రసాయన చర్య జరిగి ఆరోగ్యకమైన బ్యాక్టీరియా పిండిలో ఏర్పడుతుంది. ఇలా చేసుకున్న చపాతీలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.

ఇది కూడా చదవండి: Health Facts: ఆహారం తిన్న వెంటనే మీరూ ఈ పనులు చేస్తారా? ఈ 5 అలవాట్లు ఎంత చెడ్డవో తెలిస్తే..



పెనం..(pan)

ఇప్పట్లో చాలామంది నాన్ స్టిక్ పాత్రలు ఉపయోగిస్తున్నారు. అయితే చపాతీలు కాల్చడానికి నాన్ స్టిక్ పెనం ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. చపాతీ కాల్చడానికి ఎల్లప్పుడూ ఐరన్ పెనం మాత్రం ఉపయోగించాలి. ఇనుప పెనం లో కాల్చిన చపాతీలు ఆరోగ్యానికి చాలా మంచివి.

నిల్వచేయడం.. (storage)

చపాతీలు కాల్చిన తరువాత వాటి వేడి పోకుండా ఉండటం కోసం చాలామంది సిల్వర్ ఫాయిల్ ఉపయోగిస్తుంటారు. వేడ వేడి చపాతీలను సిల్వర్ ఫాయిల్ లో చుట్టి ఉంచితే ఎంతసేపైనా అవి వేడిగా ఉంచాయి. కానీ చపాతీలను ఇలా సిల్వర్ ఫాయిల్ లో ఉంచడం అస్సలు మంచిది కాదు. సిల్వర్ ఫాయిల్ కు బదులుగా క్లాత్ లో చపాతీలను ఉంచితే చపాతీలు వేడిగా, మెత్తగా ఉంటాయి.

పిండి రకం.. (flour type)

మార్కెట్లో చాలా రకాల పిండులు అందుబాటులో ఉంటాయి. సాధారణ గోధుమ పిండి నుండి మల్టీగ్రైన్ గోధుమ పిండి వరకు చాలా ఉన్నాయి. కానీ పోషకాహార నిపుణులు, పరిశోధకుల ప్రకారం మల్టిగ్రైన్ పిండి అస్సలు ఉపయోగించకూడదట. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఏ పిండిని ఉపయోగించినా అది ఒక్క ధాన్యంతో చేసిన పిండి అయి ఉండాలని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఇదే మంచిది.

ఇది కూడా చదవండి: Garlic Onion Peel: ఉల్లిపాయలు, వెల్లిపాయల పొట్టును డస్ట్‌బిన్‌లో పారేస్తున్నారా..? ఈ నిజాలు తెలిస్తే జాగ్రత్తగా దాచిపెడతారేమో..!


Updated Date - 2023-11-07T11:46:49+05:30 IST