RRR: అయ్యబాబోయ్.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్స్ పబ్లిసిటీ కోసం ఇంత ఖర్చయిందా?
ABN , First Publish Date - 2023-03-04T17:51:42+05:30 IST
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. అయితే, గోల్డెన్ గ్లోబ్, అకాడమీ అవార్డ్స్ క్యాంపెయిన్ కోసం దర్శకధీరుడు రాజమౌళి భారీగా ఖర్చు పెట్టారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సొంతంగా అకాడమీ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అదే విధంగా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో పోటీపడింది. గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్స్ ఇతర ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ప్రచార కార్యక్రమాల కోసం ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ భారీగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. దాదాపుగా రూ.83కోట్లను పబ్లిసిటీ కోసం వెచ్చించారని సమాచారం అందుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఖర్చులో అత్యధిక భాగాన్ని జక్కన్ననే సొంతంగా భరించారట. ‘ఆర్ఆర్ఆర్’ కు జపాన్, రష్యాలో లభించిన కలెక్షన్స్ నుంచి మిగిలిన మొత్తాన్ని వెచ్చించారట. అయితే, ప్రచార కార్యక్రమాలకు అయిన ఖర్చును చిత్రబృందం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. అకాడమీ అవార్డ్స్‌ను లాస్ ఏంజెలెస్‌లో మార్చి 12(భారతదేశ కాలమానం ప్రకారం మార్చి 13)న అందజేయనున్నారు. ఆస్కార్ పురస్కారాల సందర్భంగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు
Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!