Nikki Yadav Case: ఢిల్లీ నిక్కీయాదవ్ కేసులో కొత్త ట్విస్ట్
ABN , First Publish Date - 2023-02-18T10:21:08+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిక్కీయాదవ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది....
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిక్కీయాదవ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.(Nikki Yadav Case)24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్ తన స్నేహితురాలు నిక్కీని ఫిబ్రవరి 10వతేదీన గొంతుకోసి చంపి, నైరుతి ఢిల్లీలోని తన దాబాలోని రిఫ్రిజిరేటర్‌లో ఆమె మృతదేహాన్ని పెట్టిన ఘటనలో రోజుకొక కొత్త విషయం వెలుగుచూస్తోంది. 2020వ సంవత్సరంలోనే గ్రేటర్ నోయిడాలోని ఆర్యసమాజ్(Arya Samaj temple) ఆలయంలో సాహిల్ గెహ్లాట్(Sahil Gehlot) నిక్కీ యాదవ్‌ను వివాహం చేసుకున్నట్లు తాజాగా వెల్లడైంది. రిమాండ్ సమయంలో సాహిల్, నిక్కీల వివాహానికి సంబంధించిన వివాహ ధృవపత్రాలను(Marriage certificate) కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : Former Indian cricketer Venkatesh Prasad: పాక్‌లో ఉగ్ర దాడిపై వెంకటేష్ ప్రసాద్ సంచలన ట్వీట్
ఆ తర్వాత అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు.సాహిల్ కుటుంబం వారి వివాహం పట్ల అసంతృప్తిగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సాహిల్ అప్పటికే నిక్కీని వివాహం చేసుకున్నారనే విషయాన్ని అమ్మాయి కుటుంబం నుంచి దాచిపెట్టారు.మరోవైపు నిక్కీ యాదవ్ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్ గెహ్లాట్ తండ్రి సహా ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.నిక్కీ హత్య కేసు కుట్రలో కుమారుడికి సహాయం చేశాడనే ఆరోపణలపై అతని తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి : Cheetahs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో కునో నేషనల్ పార్కుకు వస్తున్న ఆఫ్రికన్ చీతాలు
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాహిల్ తండ్రి వీరేందర్ సింగ్, అతని ఇద్దరు సోదరులు, అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. పట్టపగలు సాహిల్ నిక్కీని హత్య చేసి, ఆమె ఫోన్ నుంచి చాటింగులను తొలగించాడని పోలీసులు చెప్పారు.గెహ్లాట్ పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్ లో దాచిపెట్టాడు. ఫిబ్రవరి 10న జరగాల్సిన తన పెళ్లి గురించి నిక్కీకి తెలిసిందని, దీంతో దంపతుల మధ్య వాగ్వాదం జరగడంతో సాహిల్ తన కారులో ఉంచిన డేటా కేబుల్‌తో నిక్కీని గొంతుకోసి చంపాడు. సాహిల్‌ను ఫిబ్రవరి 14న కస్టడీలోకి తీసుకున్నారు, తదుపరి విచారణ కోసం ఢిల్లీ కోర్టు అతన్ని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.