Scooty Video: ఇంటి బయటే స్కూటీని పార్క్ చేస్తున్నారా..? ఎందుకైనా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి..!
ABN , First Publish Date - 2023-07-17T10:13:02+05:30 IST
చాలా మందికి టూవీలర్స్ బయటే పార్క్ చేయడం అలవాటు. ఎండా వానతో సంబంధం లేకుండా వాటిని బయటే ఉంచుతుంటారు. కానీ..
టూ వీలర్స్ ఉన్న చాలామంది బయట నుండి ఇంటికి రాగానే బండి లాక్ చేసి బయటే పార్క్ చేస్తుంటారు. మరికొందరు ఇంటి ముందు కాస్త జాగా ఉంటే చాలు ఓ కవర్ కప్పేసి రాత్రంతా కూడా బయటే పెట్టేస్తారు. ఓ వ్యక్తి కూడా ఇలాగే తన స్కూటీని ఇంటి బయట పార్క్ చేశాడు. ఆ తరువాత పనిమీద బయటకు వెళ్ళాలని అతను స్కూటీ దగ్గరకు వెళ్ళాడు. ఆ స్కూటీలో అతనికి కనిపించింది చూడగానే వెన్నులో వణుకు పుట్టిందతనికి . ప్రస్తుతం ఈ సంఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
చాలా మందికి టూవీలర్స్ బయటే పార్క్ చేయడం అలవాటు. ఎండా వానతో సంబంధం లేకుండా వాటిని బయటే ఉంచుతుంటారు. రోజు మొత్తం బండి వాడాక రాత్రి పడుకునేముందు మాత్రమే బండి లోపల పెడుతుంటారు. అది కూడా ఇంటికి కాంపౌండ్ గట్రా ఉంటే అక్కడే పార్క్ చేస్తుంటారు. కానీ ఇలా ద్విచక్ర వాహనాలను ను ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ వ్యక్తి స్కూటీని(Scooty) ఇంటి బయటే పార్క్ చేశాడు. ఆ సమయంలో వర్షం కురిసింది. కొద్దిసేపటి తరువాత ఏదో పని మీద బయటకు వెళ్ళాలనుకుని ఇంటి బయటకు వచ్చాడు. స్కూటీ దగ్గరకు వెళ్ళి స్టార్ట్ చేయబోయాడు. కానీ స్కూటీ బ్రేకర్స్(scooty breakers) దగ్గర ఉండే చిన్న గ్యాప్ లో అతనికి ఏదో నల్లగా కనిపించింది. ఏమై ఉంటుందా అని అతను కాస్త అనుమానంగానే చూడగా గుండే గుభేలుమంది. నల్లగా కళ్లు మెరుస్తుండగా ఓ నాగుపాము(cobra) అక్కడ చుట్ట చుట్టుకుని కూర్చుంది(snake sitting in scooty breakers). దూరంగా వచ్చి మొబైల్ కెమెరా ఆన్ చేసి జూమ్ చేసి చూడగా ఆ పాము భయంకరంగా కనిపించింది. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించారు. పాములు పట్టేవారు అక్కడికి చేరుకుని దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఆ తరువాత స్కూటీ ముందు భాగం పార్ట్స్ ను తొలగించారు. అవి తొలగించగానే పాము బుస్సుమని బుస కొడుతూ బయటకు వచ్చింది. పాము పరిమాణం పెద్దగానే ఉండటంతో అందరూ భయపడిపోయారు. పామును గమనించుకోకపోయి ఉంటే డ్రైవ్ చేసే వారి చేతిని చాలా సునాయాసంగా అది కాటువేసేది. పాములు పట్టేవారు దాన్ని జాగ్రత్తగా అక్కడినుండి తొలగించారు. స్కూటీ మీద నెంబర్ ను బట్టి ఇది రాజస్థాన్(Rajasthan) కు చెందినదని, సంఘటన కూడా రాజస్థాన్ లో జరిగిందని అంటున్నారు.
30ఏళ్ళకే ముఖం మీద ముడతలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు 50ఏళ్ళు దాటినా సంతూర్ మమ్మీలా కనబడతారు..
ఈ వీడియోను q_bataoo అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో బొరియల్లో, పుట్టల్లో నీరు చేరడం వల్ల పాములు, పురుగులు బయటకు వస్తుంటాయి కాబట్టి జాగ్రత్త అని అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఆ పాము లాంగ్ డ్రైవ్ మూడ్ లో ఉంది, దాన్నని డిస్ట్రర్భ్ చేశారు' అని ఒకరు ఫన్నీ కామెంట్ చేశారు. 'ఆ స్కూటీ వ్యక్తి బానే ఉన్నాడా?' అని ఇంకొకరు ఆందళన వ్యక్తం చేశారు. 'స్కూటీలు, బైక్ లు స్టార్ట్ చేసేముందు జాగ్రత్తగా గమనించుకొండి' అని అందరూ జాగ్రత్తలు చెబుతున్నారు.