నడిరోడ్డుపై నగ్నంగా ఓ మహిళ రచ్చ రచ్చ.. బలవంతంగా స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఏంటీ పని అని నిలదీస్తే ఆమె చెప్పింది విని..
ABN , First Publish Date - 2023-02-22T19:09:30+05:30 IST
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఎవరూ ఊహించని విధంగా ఓ మహిళ హల్‌చల్ చేసింది. నడి రోడ్డుపై ఆమె ఉన్నట్టుండి దుస్తులు మొత్తం విప్పేయడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా షాక్ అయ్యారు. దుస్తులు కప్పే ప్రయత్నం చేసినా.. ఆమె మాత్రం అందరినీ అడ్డుకోవడంతో...
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఎవరూ ఊహించని విధంగా ఓ మహిళ హల్‌చల్ చేసింది. నడి రోడ్డుపై ఆమె ఉన్నట్టుండి దుస్తులు మొత్తం విప్పేయడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా షాక్ అయ్యారు. దుస్తులు కప్పే ప్రయత్నం చేసినా.. ఆమె మాత్రం అందరినీ అడ్డుకోవడంతో చూస్తుండిపోయారు. కొంతమంది వీడియోలు, ఫొటోలు కూడా తీశారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని, ఆమెను బలవంతంగా స్టేషన్‌కి తరలించారు. చివరకు ఆరాతీయగా ఆమె గురించి ఏం తెలిసిందంటే..
పోలీసుల కథనం మేరకు.. రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అజ్మీర్ జిల్లాలోని బీవార్ పట్టణానికి చెందిన ఓ 36 ఏళ్ల మహిళ (woman).. స్థానికంగా ఏఎన్ఎంగా (ANM) పని చేస్తోంది. ఇదిలావుండగా, 2020లో ఆమె సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లడంతో ఉన్నతాధికారులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆమెను అప్పటినుంచి ఏపీవోగా (APO) నియమించారు. అంతటితో ఆగకుండా నిత్యం వేధింపులు ఎక్కువ అవడంతో పలుమార్లు తనను తిరిగి ఏఎన్ఎంగా నియమించాలంటూ అధికారులను వేడుకుంది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం జైపూర్‌లో ఉన్నతాధికారుకు విన్నవించేందుకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా తన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరింత మనస్థాపానికి గురైంది. స్థానిక ఎస్‌ఎంఎస్ మెడికల్ కాలేజీ (Medical College) ఎదుట ఉన్న బీచ్ రోడ్డుపై ఒక్కసారిగా తన దుస్తులు విప్పేసింది.
గట్టిగా కేకలు వేస్తూ అటూ ఇటూ తిరుగుతుండడంతో స్థానికులంతా షాక్ అయ్యారు. చాలా మంది ఆమెపై దుస్తులు కప్పాలని ప్రయత్నించినా.. అందరినీ దూరంగా నెట్టింది. ఈ క్రమంలో చాలా మంది వీడియోలు కూడా తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకున్నారు. మహిళా పోలీసులు ఆమెపై దుప్పటి కప్పి, అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మహిళను పరీక్షించిన వైద్యులు.. ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. కేవలం తన ఆందోళనను వ్యక్తం చేయడం కోసమే ఇలా చేసిందని తెలిసింది. శాంతిభద్రతలకు భంగం కలిగించిందనే కారణంపై ఆమెపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆమె సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.