Shocking: ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న ఓ పాప.. పొలంలో ఉన్న ఓ వ్యక్తి అనుమానంతో గోడపై నుంచి ఆ ఇంట్లోకి తొంగి చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-21T16:02:51+05:30 IST

ఓ వ్యక్తి పొలంలో పనిచేసుకుంటున్నాడు. అతను తన పనిలో తానుండగా పొలానికి ఆనుకుని ఉన్న ఇంట్లో నుండి ఒక్కసారిగా చిన్నపాప బిగ్గరగా అరుస్తూ ఏడవడం వినిపించింది. 'ఏం జరుగుతోంది? ఆ పాప ఎందుకంత బిగ్గరగా ఏడుస్తోంది?' అనే అనుమానంతో గోడ పైనుండి ఇంట్లోకి తొంగి చూశాడు. గొడ అవతల జరుగుతున్న దృశ్యం చూడగానే అతని వెన్ను జలదరించింది

Shocking: ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న ఓ పాప.. పొలంలో ఉన్న ఓ వ్యక్తి అనుమానంతో గోడపై నుంచి ఆ ఇంట్లోకి తొంగి చూస్తే..!

తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఓ వ్యక్తి పొలంలో పనిచేసుకుంటున్నాడు. అతను తన పనిలో తానుండగా పొలానికి ఆనుకుని ఉన్న ఇంట్లో నుండి ఒక్కసారిగా చిన్నపాప బిగ్గరగా అరుస్తూ ఏడవడం వినిపించింది. 'ఏం జరుగుతోంది? ఆ పాప ఎందుకంత బిగ్గరగా ఏడుస్తోంది?' అనే అనుమానంతో గోడ పైనుండి ఇంట్లోకి తొంగి చూశాడు. గొడ అవతల జరుగుతున్న దృశ్యం చూడగానే అతని వెన్ను జలధరించింది. అతను వెంటనే కేకలు వేసి పాప తల్లిదండ్రులను అలెర్ట్ చేశాడు. 9ఏళ్ల బాలిక మీద జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కేరళ(Kerala) రాష్ట్రం కన్నూర్(Kannur) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. 9ఏళ్ల జాన్వీ అనే బాలిక(9years girl) ఇంటి పెరట్లో ఆడుకుంటోంది(girl playing in garden). ఆ ఇంటికి ఒకవైపు కాంపౌండ్ లేకపోవడంతో వీధి కుక్కులు(stray dogs)పెరట్లోకి ప్రవేశించాయి. పెరట్లో ఇతరులెవరూ లేకపోవడంతో కుక్కలు నిర్భీతిగా పాపమీదకు చొచ్చుకుపోయాయి. మూడు కుక్కలు కలిసి పాపమీద దాడిచేయడం మొదలుపెట్టాయి(stray dogs attack on girl). కుక్కల నుండి తప్పించుకుని పారిపోవడం పాప చేత కాలేదు. అక్కడే నేలమీద పడి అటూ ఇటూ గొర్లుతూ కుక్కల దాడిలో ప్రమాదం జరగకుండా తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆ పాప భయంతో బిగ్గరగా అరవసాగింది. కుక్కలు పాపను వదిలిపెట్టకుండా పాప డ్రస్సును పట్టుకుని లాగుతూనే ఉన్నాయి. ఆ పాపను అక్కడినుండి ఈడ్చుకెళ్ళడానికి(dogs try to drag girl) ప్రయత్నించాయి. అదే సమయంలో ఆ ఇంటికి ఆనుకుని ఉన్న పొలంలో పనిచేసుకుంటున్న ఓ వ్యక్తి 'పాప ఎందుకు ఎంత బిగ్గరగా ఏడుస్తోంది? ఏం జరుగుతోంది?' అనుకుంటూ ఇంటి గోడ నుండి ఇవతలికి తొంగిచూశాడు. కుక్కలు పాపమీద దాడి చేస్తుండటం చూసి అతని వెన్ను జలధరించింది. అతను వెంటనే ఆ పాప ఇంట్లో వారిని కేక వేసి పిలిచాడు. గొడ దూకి పాపను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా ఆ పాప తల్లి అక్కడికి పరిగెత్తుకు వచ్చి కుక్కలను తరిమేసింది. వెంటనే పాపను ఎత్తుకుని లోపలకి వెళ్ళిపోయింది. ఈ సంఘనటన మొత్తం ఆ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.

Health Tips: పిచ్చి గడ్డి అని పీకి పారేస్తున్నారు కానీ.. అసలు నిజాలు తెలిస్తే బంగారంలా పెంచుకుంటారు.. జ్యూస్‌గా చేసుకుని తాగితే..


ఈ వీడియోను Ghar Ke Kalesh అనే ట్వి్ట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వణికిపోతున్నారు. 'ఇది చాలా ఘోరమైన సంఘటన' అని కామెంట్ చేస్తున్నారు. 'ఆ కుక్కలు చేసిన దాడి తాలూకు భయం ఆ పాపను జీవితాంతం వెంటాడుతుంది' అని అంటున్నారు. 'ఆ పాప అంతగా అరుస్తుంటే వారి కుటుంబం ఏం చేస్తోంది అంతసేపు' అని కుటుంబ సభ్యుల మీద మండిపడుతున్నారు మరికొందరు. కాగా కేరళ కన్నూర్ లో పిల్లల మీద వీధి కుక్కల దాడి జరగడం ఈ నెలలో ఇది రెండోసారని తెలిసింది. జూన్ 11న 11ఏళ్ళ చిన్నారిమీద వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ పిల్లాడు ఇంటికి 500 మీటర్ల దూరంలో విగతజీవిగా తల్లిదండ్రులకు దొరికాడు.

Viral: ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.85 లక్షలు సంపాదన.. బస్సు కండక్టరే కానీ..!


Updated Date - 2023-06-21T16:02:51+05:30 IST