Shocking News: 8వ తరగతి పిల్లాడిని.. 4 నెలులగా క్లాసు రూమ్ బయటే కూర్చోబెడుతున్న టీచర్లు.. చివరకు ఆ బాలుడు ఏడుస్తూ తల్లికి చెప్పడంతో..

ABN , First Publish Date - 2023-04-16T09:52:34+05:30 IST

బిడ్డ ముఖంలో దిగులు కనిపించి ఆ పిల్లాడి తల్లి దిగులుపడిపోయింది. 'ఏమైందిరా కన్నా.. అలా ఉన్నావు' అంటూ దగ్గరకు తీసుకుని అడిగింది. అంతే అప్పటిదాకా తన మనసులో ఉన్న దుఃఖం అంతా బయటపెట్టాడు ఆ పిల్లాడు. 'నన్ను స్కూల్లో క్లాస్ రూమ్ బయట కూర్చోబెడుతున్నారు' అనే విషయాన్ని తల్లికి చెప్పాడు. దీనివెనక అసలు కారణం ఏమిటంటే..

Shocking News: 8వ తరగతి పిల్లాడిని.. 4 నెలులగా క్లాసు రూమ్ బయటే కూర్చోబెడుతున్న టీచర్లు.. చివరకు ఆ బాలుడు ఏడుస్తూ తల్లికి చెప్పడంతో..

పిల్లలకు స్కూల్ అయిపోగానే ఆడుతూ పాడుతూ అల్లరిచేస్తూ ఇంటికెళతారు. కానీ ఆ పిల్లాడు మాత్రం స్కూల్ అయిపోగానే దీనంగా ముఖం వేలాడదీసుకుని ఇంటికెళ్ళాడు. తన బిడ్డ ముఖంలో దిగులు కనిపించి ఆ పిల్లాడి తల్లి దిగులుపడిపోయింది. 'ఏమైందిరా కన్నా.. అలా ఉన్నావు' అంటూ దగ్గరకు తీసుకుని అడిగింది. అంతే అప్పటిదాకా తన మనసులో ఉన్న దుఃఖం అంతా బయటపెట్టాడు ఆ పిల్లాడు. 'నన్ను స్కూల్లో క్లాస్ రూమ్ బయట కూర్చోబెడుతున్నారు' అనే విషయాన్ని తల్లికి చెప్పాడు. ఆ మాట వినగానే ఆ త్లలి మనసు విలవిల్లాడిపోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 4నెలల నుండి తన బిడ్డను తరగతి బయట కూర్చోబెడుతున్నారని తెలిసి ఉగ్రురాలిగా మారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలు చాలా సున్నిత మనస్కులు.వారి మనసు తొందరగా గాయపడుతుంది. అందుకే పిల్లల్ని ఇతరులతో పోల్చడం, తక్కువ చేసి మాట్లాడటం వారి మనసు నొప్పించడం చేయకూడదు. ఈ విషయం సమాజానికంటే, తల్లిదండ్రులకంటే బాగా స్కూల్ టీచర్లకు తెలిసి ఉంటుంది. కానీ మెట్రో నగరం అయిన ముంబైలో(Metro city Mumbai) ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్(English medium school) లో అమానవీయ ఉదంతం వెలుగుచూసింది. ముంబైలో నివసిస్తున్న ఓ వ్యక్తికి నలుగురు పిల్లలున్నారు. అతను తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలసి ఉంటున్నాడు. అతను పనిచేసినన్ని రోజులు కుటుంబం బాగా గడిచిపోయేది. ఇంటి అవసరాల నుండి స్కూల్ ఫీజుల వరకు అన్ని చక్కబెట్టుకునేవారు. కానీ అతనికి టీబీ(TB) సోకడంతో అతని ఆరోగ్యం క్షీణించింది, పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయాడు. ముంబైలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో తన ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఒకరు 2వ తరగతి(2nd class) కాగా మరొకరు 8వతరగతి(8th class) చదువుతున్నారు. ఇంటి పరిస్థితి బాగలేని కారణంగా స్కూలుకు కట్టాల్సిన ఫీజులో 7500రూపాయలు(7500 rupees) బాకీ పడిపోయాయి. ఫీజు కట్టలేదనే కారణంతో 8వతరగతి చదివే పిల్లాడిని తరగతిలోకి అనుమతించకుండా బయటే కూర్చోబెడుతున్నారు. 2వ తరగతి చదువుతున్న పిల్లాడిని కూడా మానసికంగా వేధిస్తున్నారని తెలిసింది. స్కూల్ నుండి వచ్చిన కొడుకు దిగులుగా ఉండటం చూసిన తల్లి కొడుకు దగ్గరకు తీసుకుని అడగ్గా విషయం మొత్తం చెప్పాడు.

Viral Video: పట్టు పురుగుల నుంచి అసలు దారాన్ని ఎలా తీస్తారన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..? ఈ వీడియో చూస్తే ఫుల్లు క్లారిటీ ఖాయం..!


కొడుకు చెప్పిన విషయం వినగానే పిల్లాడి తల్లి ఉగ్రురాలైపోయింది. ఆమె వెంటనే పోలిస్ స్టేషనుకు వెళ్ళి స్కూలు యాజమాన్యం మీద ఫిర్యాదు చేసింది. తాము క్రమం తప్పకుండా ఫీజు కడుతూనే ఉన్నామని, గత కొంతకాలంగా తన భర్త అనారోగ్య కారణంగా ఫీజు చెల్లించలేక పోయామని దానికి పిల్లలను ఇంత దారుణంగా హించడమేంటని అమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ లో సెక్షన్ 23(jubenile justict act section 23) ప్రకారం పిల్లల పట్ల క్రూరత్వం ప్రదర్శించినందుకు ఇద్దరు ఉపాధ్యాయులు, పాఠశాల అధికారిపై కేసు నమోదు చేశారు.

Wife: భార్యకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఒంటి చేత్తోనే ఆమె విధులు నిర్వహించడం వెనుక..!


Updated Date - 2023-04-16T09:52:34+05:30 IST