Shocking Video: ఈత కొడుతున్న ముగ్గురు స్నేహితులు.. సడన్‌గా వాళ్ల మధ్యలోకి వచ్చినదేంటో చూసి గుండె ఆగిపోయినంత పనయింది.. చివరకు..!

ABN , First Publish Date - 2023-05-16T18:53:43+05:30 IST

ఈత కొడుతున్నప్పుడు కొంతమందికి చేపలు, కర్మ కాలి పాములు ఎదురవుతుంటాయి.. కానీ వీళ్ళకు కనిపించిందేంటో చూస్తే..

Shocking Video: ఈత కొడుతున్న ముగ్గురు స్నేహితులు.. సడన్‌గా వాళ్ల మధ్యలోకి వచ్చినదేంటో చూసి గుండె ఆగిపోయినంత పనయింది.. చివరకు..!

గ్రామాల్లో ఉన్న పిల్లలకు ఈత కొట్టడం(Swimming) అంటే మహా ఇష్టం. జట్టులుగా ఏర్పడి కాలువలకు, చెరువులకు ఈత కోసం వెళుతుంటారు.కొందరు స్నేహితులు తమకు దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ఈత కోసం వెళ్ళారు. వారు ముగ్గురూ నీటిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తోంటే మరొక స్నేహితుడు తన దగ్గరున్న మొబైల్ లో వారి అల్లరిని రికార్డ్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ముగ్గురు స్నేహితుల మధ్య ఓ భారీ ఆకారం ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూడగానే కుర్రాళ్ళ గుండెలు గుభేలుమన్నాయి. అదేంటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలకు ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా తొట్టిగ్యాంగ్ తో కలసి ఈతకు వెళుతుంటారు. అలాగే కొందరు స్నేహితులు(fiends) తమకు దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ఈతకు వెళ్ళారు. ముగ్గురు స్నేహితులు నీళ్ళలో ఈత కొడుతోంటే, మరొక స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. సడన్ గా నీళ్ళలో ఈత కొడుతున్న స్నేహితుల ముందు భారీగా ఉన్న నీటి ఏనుగు(giant hippopotamus) ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూడగానే కుర్రాళ్ల గుండె ఆగినంత పనైంది. ఆ నీటి ఏనుగు నీళ్ళలో నుండి తల పైకెత్తి గట్టిగా గురక పెట్టడంతో ఆ శబ్దం మరింత భయంకరంగా(sound become terrifying) మారింది. దాన్ని చూసి కుర్రాళ్లు బెంబేలు పడిపోయారు. అక్కడి నుండి తలోక దిక్కూ పరిగెత్తారు. ఇక ఈత కొడుతున్న స్నేహితుల అల్లరిని రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఆ భారీ నీటి ఏనుగును చూసి మొబైల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అతను కూడా అక్కడినుండి పరుగందుకున్నాడు. ఈ సంఘటన ఆఫ్రికాలో జరిగినట్టు తెలిసింది.

Viral Video: బుడ్డోడే కానీ బాగా తెలివున్నోడు.. అమ్మ ప్రేమంటే ఏంటో తెలిసినోడు.. ఓ గొర్రెపిల్ల తప్పిపోతే స్వయంగా తీసుకెళ్లి మరీ..!


ఈ వీడియోను Terrifying Nature అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. 'వామ్మో ఆ నీటి ఏనుగు కుర్రాళ్ళను మింగినంత పని చేసిందే' అంటున్నారు. 'నీటి ఏనుగులు ప్రమాదకరమైనవి కావని అనుకునేవాళ్ళం కానీ అది తప్పని తెలిసింది' అంటున్నారు మరికొందరు. 'ఆ కుర్రాళ్ళు క్షేమంగా బయటపడ్డారని ఆశిస్తున్నా' అని మరొకరు కామెంట్ చేశారు.

Viral News: ఈ రెండున్నరేళ్ల పాపకు అద్భుత శక్తులున్నాయా..? ఎలా బతికిందంటూ అంతా ఆశ్చర్యం.. క్రూర మృగాలున్న అడవిలో 4 రోజుల పాటు..


Updated Date - 2023-05-16T19:08:02+05:30 IST