Viral: అక్కడ షాపింగ్ అంత ఈజీ కాదు.. భారీ కొండ మధ్యలో వేలాడుతూ చిన్న దుకాణం.. అసలు విషయమేమిటంటే..

ABN , First Publish Date - 2023-08-15T10:51:33+05:30 IST

సాధారణంగా ఎవరైనా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే బిజినెస్ బాగా జరుగుతుందని ఆశిస్తారు. అయితే చైనాలోని ఓ వ్యక్తి మాత్రం అత్యంత భయంకర ప్రదేశంలో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు.

Viral: అక్కడ షాపింగ్ అంత ఈజీ కాదు.. భారీ కొండ మధ్యలో వేలాడుతూ చిన్న దుకాణం.. అసలు విషయమేమిటంటే..

సాధారణంగా ఎవరైనా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలు (Shop) ఏర్పాటు చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే బిజినెస్ బాగా జరుగుతుందని ఆశిస్తారు. అయితే చైనా (China)లోని ఓ వ్యక్తి మాత్రం అత్యంత భయంకర ప్రదేశంలో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దుకాణం ఓ భారీ కొండకు మధ్యలో వేలాడుతూ ఉంటుంది (Hanging shop). సాధారణ వినియోగదారులు ఎవరైనా ఆ షాప్ దగ్గరకు వెళ్లి కొనుక్కుని తిరిగి రావడం దాదాపు ఆసాధ్యం. ట్రెక్కింగ్ (Trekking) చేసే వారి కోసమే ప్రత్యేకంగా ఆ షాప్ ఏర్పాటు చేశారు.

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్‌జియాంగ్ కౌంటీలోని Xinyuzhai నేషనల్ జియోలాజికల్ పార్క్‌లో ఈ షాప్‌ను ఏర్పాటు చేశారు. పర్వతం పై నుంచి వేలాడేలా ఒక చిన్న చెక్క పెట్టెను ఉంచారు. పర్వతాధిరోహకులకు (Mountain Climbers) అవసరమైన వస్తువులను అక్కడ విక్రయిస్తారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో 120 మీటర్ల 393 అడుగుల ఎత్తులో ఉన్న కొండకు మధ్యలో ఉన్న ఈ దుకాణంలోకి సరకులను జిప్ లైన్ ద్వారా చేరవేస్తారు.

Instagram: భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. భర్త అకౌంట్ బ్లాక్.. అనుమానంతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

ఆ షాప్‌లో ట్రెక్కింగ్ చేసే వారికి అవసరమైన స్నాక్స్, కూల్‌డ్రింక్స్ లభ్యమవుతాయి. ఆ షాప్‌నకు సంబంధించిన ఫొటోలు @gunsnrosesgirl3 అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయ్యాయి. ఆ పోస్ట్ 4.50 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది (Viral Tweet). ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``మర్చిపోలేని షాపింగ్ అనుభవం``, ``ఇది చాలా క్రేజీ ఐడియా``, ``వామ్మో.. అక్కడ షాపింగ్ చేయాలంటే చాలా ప్రత్యేకమైన ట్యాలెంట్ ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-15T10:51:33+05:30 IST