Karnataka: కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా బీజేపీ కార్యాలయంలోకి నాగుపాము

ABN , First Publish Date - 2023-05-13T10:36:47+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది....

Karnataka: కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా బీజేపీ కార్యాలయంలోకి నాగుపాము
Snake Enters BJP Office

షిగ్గావ్‌(కర్ణాటక):కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.(Snake Enters BJP Office) కర్ణాటక రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా(Counted In Karnataka) షిగ్గావ్ బీజేపీ కార్యాలయంలోకి నాగు పాము ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయ ఆవరణలోకి పాము ప్రవేశించింది.నాగు పామును పట్టుకొని, క్యాంపు కార్యాలయానికి భద్రత కల్పించారు.సీఎం బసవరాజ్ బొమ్మయ్ షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఉండగానే ప్రాంగణంలోకి పాము ప్రవేశించిన ఘటన ఇక్కడి ప్రజల్లో గందరగోళం సృష్టించింది.

ఇది కూడా చదవండి : Yathindra Siddaramiah: మా నాన్నే కర్ణాటక ముఖ్యమంత్రి...సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైల(Karnataka Chief Minister Basavaraj Bommai) మధ్య గట్టి పోటీ ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉంది.కర్ణాటకలో 1985వ సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న వ్యక్తిని ఎన్నడూ ప్రజలు తిరిగి అధికారంలోకి తీసుకురాలేదు.

Updated Date - 2023-05-13T10:40:37+05:30 IST