Viral Video: ఇంత చిన్న షూలో.. అంత పెద్ద పాము ఎలా దూరిందబ్బా..? ఆమె బయటకు ఎలా తీసిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-07-14T16:57:27+05:30 IST

సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. భయంకరమైన కొండ చిలువలు, ఇంట్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.

Viral Video: ఇంత చిన్న షూలో.. అంత పెద్ద పాము ఎలా దూరిందబ్బా..? ఆమె బయటకు ఎలా తీసిందో మీరే చూడండి..!

సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పాములకు (Snakes) సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. భయంకరమైన కొండ చిలువలు, ఇంట్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు (Snake Videos) సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ షూ‌లోకి ఓ పాము దూరింది (Snake in shoes). చూసుకోకుండా దానిని వేసుకుని ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అయితే షూలో పామును చూసిన వారు పాముల పట్టే మహిళను పిలిపించారు.

snakerescueraarti అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో చాలా మందిని భయపెడుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ బూటు లోపల ఏదో వెతుకుతోంది. బూటును కింద వేసి కొట్టింది. తర్వాత ఓ ఐరన్ రాడ్‌తో షూ ఓపెన్ చేసి చూస్తే లోపల ఓ పాము కనిపించింది. ఆ మహిళ షూ లోపలి నుంచి పామును ఒట్టి చేతులతోనే బయటకు తీసింది (woman rescue snake). ఆ మహిళ పాములను పట్టడంలో ఎక్స్‌పర్ట్. ఆ వీడియో చూసి చాలా మంది షాకయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Viral News: బాబోయ్.. ఇంత డబ్బు ఏం చేసుకోవాలి..? రూ.14 వేల విమాన టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. రీఫండ్ ఎంతొచ్చిందో చూస్తే..!

ఆ వీడియోను ఇప్పటివరకు 11 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``షూ వేసుకునే ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి``, ``వీడియో చాలా భయంకరంగా ఉంది``, ``ఆ మహిళకు చాలా ధైర్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-14T16:57:27+05:30 IST