Share News

Viral Video: సరుకులతో ఇంటికొచ్చిన యువతికి తలుపు వద్ద అనుమానాస్పద దృశ్యం.. విషయం ఏంటో తెలుసుకోవాలని సీసీ ఫుటేజీ చూడగా..

ABN , First Publish Date - 2023-11-19T17:16:05+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో పాటూ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు వీడియోల రూపంలో దర్శనమివ్వడం, ఆ వెంటనే...

Viral Video: సరుకులతో ఇంటికొచ్చిన యువతికి తలుపు వద్ద అనుమానాస్పద దృశ్యం.. విషయం ఏంటో తెలుసుకోవాలని సీసీ ఫుటేజీ చూడగా..

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో పాటూ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు వీడియోల రూపంలో దర్శనమివ్వడం, ఆ వెంటనే అవి సోషల్ మీడియాలో వైరల్ అవడం సర్వసాధారణమైపోయింది. వీటిలో కొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్నింటిని నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి కిరాణా సరుకులతో ఇంటికి వచ్చింది. అయితే తలుపు వద్ద ఆమెకు అనుమాదాస్పద దృశ్యం కనిపించింది. దీంతో విషయం ఏంటో తెలుసుకోవాలని చివరకు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా ఫన్నీ సీన్ కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) కిరాణా సరుకులు పట్టుకుని ఇంటికి వస్తుంది. సరుకులు పక్కన పెట్టి తలుపు తీసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తలుపు పక్కనే ఉన్న గోడపై రుచికరమైన కుకీ కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆమెకు సందేహం వస్తుంది. ‘‘ఈ కుకీని ఎవరు ఇక్కడ పెట్టారబ్బా’’.. అని మనసులో అనుకుంటూనే ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజీని (CCTV footage) పరిశీలిస్తుంది. దీంతో ఆమెకు చివరకు ఓ ఫన్నీ సీన్ కనిపిస్తుంది. ఆ కుకీని ఓ ఉడుత ( squirrel) నోటితో పట్టుకుని, దాన్ని తలుపు పక్కన గోడపై పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. చివరకు అక్కడే ఉన్న ఇనుప రెయిలింగ్‌‌పైకి ఎగిరి.. అటు నుంచి అటే గోడ మీదకు ఎగిరుతుంది.

Viral Video: ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు రియల్.. ఈ బైకర్ చేసిన విన్యాసం చూస్తే.. మతి పోవాల్సిందే..

కుకీని తలుపు పక్కన పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ‘‘నా యజమానికి స్వాగతం’’.. అంటూ తన కోసం కుకీని తలుపు వద్ద పెట్టడం చూసి సదరు యువతి ఎంతో సంతోషిస్తుంది. తాను రోజూ ఉడుతలకు ఆహారం పెడుతుంటానని, ఈ ఉడుత ఇలా తనపై ప్రేమ చూపించందంటూ మురిసిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఉడుత తన యజమాని రుణం తీర్చుకుంది’’.. అంటూ కొందరు, ‘‘ఎంత తెలివైన ఉడుత ఇది’’. అంటూ మరికొందరు, ‘‘అరె! చాలా ఆశ్చర్యంగా ఉందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీళ్లలో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాడునుకుంటే ఇతనేంటీ.. చివరికి అందరికీ ఇలా షాక్ ఇచ్చాడు..

Updated Date - 2023-11-19T17:16:37+05:30 IST