RRR: ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘ఆర్ఆర్ఆర్’

ABN , First Publish Date - 2023-01-24T19:21:00+05:30 IST

పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది.

RRR: ఆస్కార్‌కు అడుగు దూరంలో  ‘ఆర్ఆర్ఆర్’

పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ అవార్డును కైవసం చేసుకుంది. ‘లాస్‌ఏంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డ్స్‌లో బెస్ట్‌ మ్యూజిక్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గాను కీరవాణి (Keeravani) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతా రామరాజు, గోండు యోధుడు కొమురం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. చిత్రాన్ని 1920ల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. ఆలియా భట్, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రూ.1200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్రానికి విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. హాలీవుడ్ టెక్నిషీయన్స్‌తో పాటు అనేక మంది మూవీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫలితంగా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. తాజాగా నామినేషన్‌ను సైతం దక్కించుకుంది.

Updated Date - 2023-01-24T19:34:40+05:30 IST