Delhi: వీడేం శిష్యుడు.. లైవ్ క్లాస్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్..

ABN , First Publish Date - 2023-10-06T15:38:33+05:30 IST

లైవ్ లో ఓ టీచర్ క్లాసులు చెబుతుండగా స్టూడెంట్(Student) ఆయన్ని చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయింది.

Delhi: వీడేం శిష్యుడు.. లైవ్ క్లాస్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్..

ఢిల్లీ: లైవ్ లో ఓ టీచర్ క్లాసులు చెబుతుండగా స్టూడెంట్(Student) ఆయన్ని చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయింది. వీడియోలో కనిపించిన వివరాల ప్రకారం.. ఫిజిక్స్‌ వల్లాహ్ యాప్(physics wallah) లోని లైవ్ క్లాస్ లో ఓ టీచర్(Teacher) ఫిజిక్స్ క్లాస్ చెబుతుంటారు. అదే టైంలో క్లాస్ లోని ఓ స్టూడెంట్ చెప్పుతో టీచర్ పై దాడి చేస్తాడు. టీచర్ అతని బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతారు.


అనంతరం ఆ స్టూడెంట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాల్ని ఓ స్టూడెంట్ రికార్డ్ చేసి సోషల్ మీడియలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్టూడెంట్ ప్రవర్తనపై మండి పడుతున్నారు. ఫిజిక్స్‌ వల్లాహ్ యాప్ ని ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లోని అలహాబాద్‌కు చెందిన విద్యావేత్త అలఖ్ పాండే 2016లో స్థాపించారు. ఇక్కడ నీట్(NEET), జేఈఈ(JEE) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు.

Updated Date - 2023-10-06T15:40:51+05:30 IST