Viral Video: ఈ వీడియో వైరల్ కావాల్సిందే.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటో పిల్లలకు ఆ టీచర్ ఎలా వివరిస్తోందో చూడండి..
ABN , First Publish Date - 2023-08-11T10:32:34+05:30 IST
ఎన్ని చట్టాలు చేసి, కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలను, చిన్న పిల్లలను వేధింపులకు గురి చేసే వారి తీరు మాత్రం మారడం లేదు. ఆ చట్టాలేవీ మృగాళ్లను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీచర్ చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది.
ఎన్ని చట్టాలు చేసి, కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలను, చిన్న పిల్లలను వేధింపులకు (Harassment) గురి చేసే వారి తీరు మాత్రం మారడం లేదు. ఆ చట్టాలేవీ మృగాళ్లను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా చిన్న పిల్లల (Children)పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్ ఆశ చూపి వారిపై ఘోరాలకు పాల్పడతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీచర్ తన విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన విషయాన్ని భోదిస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఉపాధ్యాయురాలు (Teacher) తన విద్యార్థులకు బ్యాడ్ టచ్ (Bad touch) అంటే ఏమిటో, అలా ఎవరైనా టచ్ చేస్తే ఏం చేయాలో నేర్పిస్తోంది. ఎవరైనా చేతులు వేసినపుడు, ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం వంటివి చేసినపుడు వారిని ఎలా నిలువరించాలో ఆ టీచర్ తన విద్యార్థుల (Students)కు నేర్పించింది. బ్యాడ్ టచ్‌ను గుర్తించి వారికి తన ఆగ్రహాన్ని ఎలా చూపించాలో నేర్పించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఊరు మొత్తానికి సూపర్ వాష్ బేషిన్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!
Roshan Rai అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ``ఈ ఉపాధ్యాయురాలు వైరల్ కావడానికి అర్హురాలు. ఈ వీడియో దేశంలోని ప్రతి పాఠశాలలోనూ చూపించాలి`` అని కామెంట్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 16 లక్షల మంది వీక్షించారు. 31 వేల మందికి పైగా లైక్ చేశారు. చిన్నపిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముందుగా ఇలాంటివి నేర్పించాలని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.