Bride: పగోడికి కూడా రాకూడని కష్టమిది.. పెళ్లయి 24 గంటలకు కూడా గడవకముందే వధువు చెవిన వరుడి మృత్యువార్త..!
ABN , First Publish Date - 2023-12-01T14:15:30+05:30 IST
Wedding procession: హర్యానాలోని పల్వాల్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. పెళ్లయి 24 గంటలు కూడా గడవకముందే వరుడు ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. దీంతో కాళ్ల పారాణి ఆరకముందే వధువు విధవరాలిగా మారింది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. వధువు పరిస్థితి చూసినవారు పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని చెబుతున్నారు.
Wedding procession: హర్యానాలోని పల్వాల్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. పెళ్లయి 24 గంటలు కూడా గడవకముందే వరుడు ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. దీంతో కాళ్ల పారాణి ఆరకముందే వధువు విధవరాలిగా మారింది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. వధువు పరిస్థితి చూసినవారు పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. పల్వాల్‌లోని భగత్‌జీ కాలనీకి చెందిన దలీబార్ (22) కు యూపీలోని అలీఘర్ జిల్లా ఐదల్‌పూర్‌కు చెందిన పూజా అనే యువతితో నవంబర్ 28 రాత్రి వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాతి రోజు కుటుంబ సభ్యులు, బంధువులు నవదంపతులను తీసుకుని పల్వాల్‌కు తిరిగి వచ్చారు. ఆ రోజు సొంతూరిలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించింది దలీబార్ ఫ్యామిలీ.
Anju: ఆమె కనుక మా ఊరికి వస్తే ప్రాణాలతో వదిలి పెట్టం.. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన అంజూ సొంతూళ్లో పరిస్థితి ఇదీ..!
ఇక రిసెప్షన్ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా అతడు బయటికి వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కుటుంబ సభ్యులకు దలీబార్‌ను రైలు ఢికొట్టిందనే సమాచారం అందింది. అంతే.. అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ గుండెల విసెలా రోధించారు. ఇక వధువు పరిస్థితి అయితే మరి దారుణం. పాపం.. కాళ్ల పారాణి ఆరకముందే వధువు విధవరాలిగా మారిన వైనం. పెళ్లైన గంటల వ్యవధిలోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి, అందరూ పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు.