Shocking Video: ఒక వైపు కొండ, మరోవైపు సముద్రం.. ఫొటోలు తీసుకుంటున్న పర్యాటకులు.. అప్పుడు జరిగిందో షాకింగ్ ఘటన!

ABN , First Publish Date - 2023-08-13T16:01:05+05:30 IST

మనసులను దోచుకునే అందమైన ప్రదేశాలు ఒక్కోసారి చాలా ప్రమాదకరమైనవిగా మారిపోతుంటాయి. ప్రకృతిని ఆస్వాదిస్తుండగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ప్రకృతి అందం వెనుక ఎంతటి ప్రమాదాలు పొంచి ఉంటాయో అర్థమవుతుంది.

Shocking Video: ఒక వైపు కొండ, మరోవైపు సముద్రం.. ఫొటోలు తీసుకుంటున్న పర్యాటకులు.. అప్పుడు జరిగిందో షాకింగ్ ఘటన!

మనసులను దోచుకునే అందమైన ప్రదేశాలు ఒక్కోసారి చాలా ప్రమాదకరమైనవిగా మారిపోతుంటాయి. ప్రకృతిని (Nature) ఆస్వాదిస్తుండగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)చూస్తే ప్రకృతి అందం వెనుక ఎంతటి ప్రమాదాలు పొంచి ఉంటాయో అర్థమవుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. DorsetCouncilUK అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

ఇంగ్లండ్‌ (England)లోని డోర్సెట్‌లోని జురాసిక్ కోస్ట్‌లోని గోల్డెన్ గేట్‌వే బీచ్‌లో ఈ ఘటన జరిగింది. బీచ్ (Beach) దగ్గర ఉన్న కొండ (Mountain) ముందు నిలబడి కొందరు పర్యాటకులు (Tourists) సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కొండ చరియలు అతి వేగంగా విరిగిపడ్డాయి. వెంటనే స్పందించిన పర్యాటకులు అక్కడి నుంచి పారిపోయారు. అప్పటివరకు ఎంతో ఆహ్లాదంగా కనిపించిన ఆ ప్రదేశం భీతావహంగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Shocking Video).

Viral Video: రైతే కదా అని చులకనగా చూడకండి.. పొలంలో ఈ సెట్టింగ్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్

ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ షాకింగ్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``థాంక్ గాడ్.. ఎవరికీ ఏమీ జరగలేదు``, ``అత్యంత భయంకరం``, ``షాకింగ్ వీడియో.. ఇంతకు ముందు కూడా ఆ బీచ్‌లో ఇలా జరిగింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-13T16:01:05+05:30 IST