Viral Video: ఈ బుడ్డోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడాలేక.. పడిన తిప్పలు ఉన్నాయి చూడండి.. నవ్వు ఆపుకోలేరు..!
ABN , First Publish Date - 2023-08-20T13:29:37+05:30 IST
ఇద్దరు బుడ్డోళ్ల తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. బుడ్డోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడాలేక.. పడిన తిప్పలు ఉన్నాయి చూడండి.. నవ్వు ఆపుకోలేం అసలే.
Viral Video: ఇద్దరు బుడ్డోళ్ల తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. బుడ్డోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడాలేక.. పడిన తిప్పలు ఉన్నాయి చూడండి.. నవ్వు ఆపుకోలేం అసలే. అసలేం జరిగిందంటే.. అస్సాంలోని పచిమ్ నగామ్ (Pachim Nagaon) గ్రామంలోని 'న్యూ లైఫ్ హైస్కూల్' (New Life High School) లో పిల్లలు ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పలిపించి 'టెల్ మీ, వాట్ హ్యాపెన్‌డ్?' అని అడిగారు. 'ఇతడు నా మెడ పట్టుకున్నాడు' అని ఒకరు చెప్పాలనుకున్నారు. 'ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు' అని మరొకరు చెప్పాలనుకున్నారు. ఆ విషయాన్ని పూర్తిగా ఇంగ్లీష్ భాషలో చెప్పలేక సైన్ లాంగ్వేజ్‌తో పాటు కాస్తో కూస్తో ఆంగ్లంలో ఆ ఇద్దరు బుడ్డోళ్లు ట్రై చేసిన విధానం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను న్యూ లైఫ్ స్కూల్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.