Viral News: ఏం పనులమ్మా ఇవి..? బైకును వదిలేసి వెనక్కు తిరిగి ముద్దులు.. ఈ ఇద్దరమ్మాయిల యవ్వారం మామూలుగా లేదుగా..!
ABN , First Publish Date - 2023-05-05T15:58:57+05:30 IST
‘కామా తురాణాం న భయం న లజ్జ’ అంటుంటారు పెద్దలు. సమాజాన్ని చూసి విసుగెత్తిపోయిన ఏ మహానుభావుడు ఇలా చెప్పాడో తెలియదు గానీ ప్రస్తుత సమాజంలో జరిగే ఘటనలు చూస్తుంటే అది నూటికి నూరుపాళ్లు నిజమని అనిపిస్తోంది. కామంతో కళ్లుమూసుకుపోయే కొందరు
‘కామా తురాణాం న భయం న లజ్జ’ అంటుంటారు పెద్దలు. సమాజాన్ని చూసి విసుగెత్తిపోయిన ఏ మహానుభావుడు ఇలా చెప్పాడో తెలియదు గానీ ప్రస్తుత సమాజంలో జరిగే ఘటనలు చూస్తుంటే అది నూటికి నూరుపాళ్లు నిజమని అనిపిస్తోంది. కామంతో కళ్లుమూసుకుపోయే కొందరు వావి వరసలు, కుటుంబ కట్టుబాట్లు మరిచి కామాంధులుగా మారి బరిగితెస్తున్న సంఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. వింటునే ఉంటున్నాం. ఇప్పటివరకూ శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఎవరైతే ఏంటి? అన్నట్టుగా ఆడ, మగ కామంతో రెచ్చిపోయేవారు. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే ఆ మెట్టు ఇంకో మెట్టు ఎక్కి మరింత హీనంగా దిగజారింది.
సినిమాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో.. ఇంకా లేదంటే చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ. నేటి జనరేషన్ హద్దులు దాటి సభ్య సమాజం అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు. నలుగురు చూస్తే ఈసడించుకుంటారన్న ఇంకిత జ్ఞానం లేకుండా నీచ పనులకు తెగబడుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి కల్చర్ పాశ్చాత్య దేశాల్లోనే చూసేవాళ్లం. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఎంతో సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన ఇండియాకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇంతకీ ఏమైంది? అనే కదా? మీ డౌట్. అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఈ మధ్యకాలంలో లవర్స్ రెచ్చిపోయి.. బైకులపై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకోవడం.. కౌగిలించుకోవడాలు చూశాం. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు మరింత శృతిమించింది. ఏకంగా ఇద్దరమ్మాయిలు (Two girls) ఇంకో అడుగు ముందుకేసి కొత్తగా ట్రై చేశారు. వారు చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా (viral video) మారాయి.
చూడ్డానికి చిన్న అమ్మాయిల్లానే ఉన్నారు. పైగా చదువుకున్న అమ్మాయిల్లా ఉన్నారు. ఆడపిల్లలు అనగానే ఎంతో భయం, భక్తి కలిగి ఉంటారు. అలాంటి అమ్మాయిలిద్దరూ ఎలాంటి భయం లేకుండా నిస్సిగ్గుగా ప్రవర్తించారు. తల్లిదండ్రులు చూస్తే తిడతారన్న భయం లేదు.. సమాజం ఏమనుకుంటుందోనన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తించారు. అమ్మాయిలిద్దరూ బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని ముద్దుల్లో మునిగిపోయారు. ముద్దులు పెట్టుకోవడం.. కౌగిలించుకోవడం ( kiss and hug) ఇలా వేగంగా వెళ్తున్న బైక్ హ్యాండిల్ వదిలి మరీ రెచ్చిపోయారు. మరీ వీళ్లను ఏమనాలి?. ఏ మాత్రం పట్టు తప్పినా ఇక అంతే సంగతులు.
అయితే అమ్మాయిలిద్దరూ చేసిన పనులపై నెటిజన్లు తూర్పార పడుతున్నారు. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ల కోసం కష్టపడే తల్లిదండ్రులను నిందించాలంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు అమ్మాయిల తీరుపై మండిపడుతున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.