Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వాగదు.. రెండు కుక్క పిల్లలను భయపెట్టి తరిమేశారు.. తర్వాతేం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-11T19:36:40+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మనల్ని అలరిస్తున్నాయి. ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన వీడియోలైతే బాగా వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వాగదు.. రెండు కుక్క పిల్లలను భయపెట్టి తరిమేశారు.. తర్వాతేం జరిగిందో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మనల్ని అలరిస్తున్నాయి. ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు (Animal Videos) సంబంధించిన ఫన్నీ, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కుక్కలకు (Dog Videos) సంబంధించిన వీడియోలైతే బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Funny Video) చూసిన వారిందరికీ నవ్వు తెప్పిస్తోంది.

@TheFigen అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలో ఓ ఇంటి నుంచి రెండు చిన్న కుక్క పిల్లలు (Puppies) వారిని చూసి అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లాయి. అయితే ఆ కుర్రాళ్లు ఆ చిన్న కుక్క పిల్లలను భయపెట్టి తరిమేశారు. ఆ కుక్క పిల్లలు లోపలికి పారిపోయాయి. మరు నిమిషంలో తమతో పాటు ఓ పెద్ద కుక్కను (Dog) బయటకు తీసుకొచ్చాయి. ఆ కుక్కను చూసి ఆ ఇద్దరు కుర్రాళ్లూ పరుగులు పెట్టారు.

X-Ray Report: నడుము కింది భాగంలో భరించలేని నొప్పి.. ఎక్స్‌రే రిపోర్టులు చూసి నివ్వెరపోయిన డాక్టర్లు.. పోలీసుల ఎంట్రీతో..!

``ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. మీ కంటే బలమైనది ఎప్పుడూ ఉంటుంది! ఈ వీడియో నన్ను చాలా నవ్వించింది`` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను 14 లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-11T19:36:40+05:30 IST