Uber Driver Attacked By Girls Video: అమ్మబాబోయ్.. వీళ్లేం అమ్మాయిలండీ బాబూ.. డబ్బులు అడిగిన పాపానికి ఉబర్ డ్రైవర్‌ను కార్లోనే చితకబాదారు..!
ABN , First Publish Date - 2023-03-09T17:42:16+05:30 IST
కారులోనే పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదడంతో సదరు డ్రైవర్ పరిస్థితి..
మనం సినిమాల్లో చూస్తుంటాం.. ఏ దాదాగిరీ.. గుండాగిరీ చేసేవాళ్ళు హోటళ్ళలో తిన్నా, తాగినా, ఇతర ప్రాంతాలలో ఏమైనా తీసుకున్నా డబ్బు చెల్లించకుండా దౌర్జన్యం చేస్తుంటారు. ఏడు మంది అమ్మాయిలు కూడా ఇలాగే రౌడీయిజం చేశారు. ఉబర్ క్యాబ్ మాట్లాడుకుని, తాము చేరాల్సిన చోటికి చేరిన తరువాత డబ్బు చెల్లించమని అడిగిన మహిళా ఉబర్ డ్రైవర్ ను కారులోనే పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద దుమారం రేపుతోంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే..
అమెరికా(America) దేశం లాస్ వెగాస్(Las vegas) లో విక్టోరియా పార్ట్రిడ్జ్ అనే మహిళ ఉబర్ క్యాబ్ డ్రైవర్(Uber Cab Driver) గా పనిచేస్తోంది. ఇక్కడ కొందరు అమ్మాయిలు క్యాబ్ బుక్ చేసుకున్నారు. విక్టోరియా వారిని పికప్ చేసుకోవడానికి వెళ్ళింది. కానీ అక్కడ ఏడుగురు అమ్మాయిలు ఉండటంతో సందిగ్ధంలో పడింది. ఈమె ఎక్సెల్ డ్రైవర్, దీని ప్రకారం ఆరుమందిని మాత్రమే వ్యాన్ లో ఎక్కించుకోవాలి. అదే విషయాన్ని విక్టోరియా సదరు అమ్మాయిలకు చెబుతూ 'సారీ గర్ల్స్ నేను ఏడుగురిని ఎక్కించుకోలేను, అలా ఎక్కించుకోడం చట్టవిరుద్దం'అని చెప్పింది. అయితే ఆ అమ్మాయిలు తాము ఏడుగురు కలిసే వెళ్ళాలని, దయచేసి తమను తీసుకెళ్ళమని విక్టోరియాను కోరారు. విక్టోరియా మొదట ఒప్పుకోకపోయినా ఆ తరువాత ఆ అమ్మాయిలు బతిమాలేసరికి వారి ఫ్రెండ్షిప్ చూసి వారిని ఎక్కించుకుంది. వారు వెళ్ళాల్సిన ఏరియాకు వారిని చేర్చింది.
అమ్మాయిలందరూ క్యాబ్ నుండి దిగిపోతుంటే డబ్బు ఇవ్వమని విక్టోరియా అడిగింది. అయితే ఒడ్డుకు చేరగానే తెప్పతగలేసే స్వభావం కలిగిన ఆ అమ్మాయిలు ఉన్నట్టుండి విక్టోరియాపై పిడిగుద్దులు గుప్పించారు. అందరూ కలసి కట్టుగా చితకబాదారు.చట్టవిరుద్దమైనా తమను తీసుకొచ్చిందనే కృతజ్ఞత లేకుండా విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన మొత్తం వ్యాన్ లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్ఢయ్యింది. విక్టోరియా ఈ వీడియో బయట పెట్టడంతో పెద్ద దుమారం రేగింది. బాధిత మహిళ విక్టోరియా మాట్లాడుతూ 'ఇది చాలా భయంకరమైన అనుభవం, నేను నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటివి ఫేస్ చేయలేదు' అని ఎంతో భయపడుతూ చెప్పింది. ఈ వీడియో Fight Haven అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ఉబర్ సపోర్ట్ సంస్థ స్పందిస్తూ 'ఇది గత ఏడాది జరిగిన సంఘటన, ఈ విషయం తెలిసిన వెంటనే మేము ఆ రైడర్ లను నిషేదించాము, వారికి మా సర్వీస్ ఉండదు' అని కామెంట్ చేశారు.