Viral: 148 దేశాలను చూపిస్తామని రూ.26 లక్షలను తీసుకుని.. చివరకు ఆ మహిళను రోడ్డున పడేశారు..!
ABN , First Publish Date - 2023-12-07T12:14:24+05:30 IST
US Woman Sells Home To Fund 3 Year Luxury Cruise: ప్రపంచాన్ని చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి. లైఫ్‌టైమ్‌లో ఒక్కసారైనా ఈ పని చేయాలనుకునేవారు చాలా మందే ఉంటారు. దీని కోసం ఎంతనైనా వెచ్చించడానికి వెనకాడుగు వేయరు. ఇదిగో యూఎస్‌లో ఉండే ఈ మహిళ (US Woman) కూడా అదే చేసింది. ఏకంగా తాను నివాసం ఉంటున్న ఇంటిని అమ్మేసి మరి ప్రపంచయాత్ర కోసం ఓ ట్రావెల్ కంపెనీకి డబ్బులు కట్టింది.
US Woman Sells Home To Fund 3 Year Luxury Cruise: ప్రపంచాన్ని చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి. లైఫ్‌టైమ్‌లో ఒక్కసారైనా ఈ పని చేయాలనుకునేవారు చాలా మందే ఉంటారు. దీని కోసం ఎంతనైనా వెచ్చించడానికి వెనకాడుగు వేయరు. ఇదిగో యూఎస్‌లో ఉండే ఈ మహిళ (US Woman) కూడా అదే చేసింది. ఏకంగా తాను నివాసం ఉంటున్న ఇంటిని అమ్మేసి మరి ప్రపంచయాత్ర కోసం ఓ ట్రావెల్ కంపెనీకి డబ్బులు కట్టింది. మూడేళ్లు క్రూయిజ్‌లో తిప్పుతామని, 148 దేశాలు చూపిస్తామని ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.26 లక్షలు తీసుకుందా ట్రావెల్ కంపెనీ. తీరా.. యాత్ర ప్రారంభానికి ముందు కంపెనీ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఈ ట్రిప్‌నే క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో అమెరికా మహిళతో పాటు కంపెనీకి డబ్బులు కట్టిన మిగతా ప్రయాణీకులు కూడా లబోదిబో అంటున్నారు. ఇక ఉంటున్న ఇల్లు అమ్మేసినా యూఎస్ మహిళ రోడ్డున పడింది.
ఇది కూడా చదవండి: Viral: ఈ ఫొటోలోని మహిళ రెండు కాళ్లను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలిస్తే..!
వివరాల్లోకి వెళ్తే.. యూఎస్‌కు చెందిన కేరి విట్మన్ (Keri Witman) కు ఎప్పట్నుంచే ప్రపంచయాత్ర చేయాలని ఉండేది. జీవితంలో ఒక్కసారైనా ప్రపంచ దేశాన్నింటినీ చుట్టిరావాలని అనుకునేది. దీనికోసం ఆమె చాలా ట్రావెల్ కంపెనీల చుట్టు తిరిగింది. చివరకు ఓ ట్రావెల్ కంపెనీ లగ్జరీ క్రూయిజ్ (Luxury Cruise) లో ప్రపంచయాత్ర అంటూ ప్రకటన చేసింది. మూడేళ్ల పాటు సముద్రమార్గంలో క్రూయిజ్‌లో తిప్పుతామని తెలిపింది. అంతేగాక ఈ ట్రిప్‌లో పర్యాటకులను 148 దేశాలు చూపిస్తామని పేర్కొంది. ఏడు ఖండాలలోని వందలాది పోర్ట్స్‌ను సందర్శించవచ్చని చెప్పింది. అలాగే ఈ మూడేళ్ల కాలంలో ప్రయాణీకులు వర్క్ ఫ్రమ్ హోం, మెడికల్ కేర్, స్నేహితులు, కుటుంబ సభ్యులను సందర్శించే అవకాశం తదితర సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన కేరి ప్రపంచాన్ని చుట్టిరావాలనే తన కల నేరవెరబోతుందని సంబరపడిపోయింది. వెంటనే ఆన్‌లైన్ ద్వారా కంపెనీ వారిని సంప్రదించింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!
వారితో కూలంకషంగా మాట్లాడిన తర్వాత ఆమె 2022 ఏప్రిల్‌లో ఈ ట్రిప్ కోసం మొదటి విడతగా 32వేల డాలర్లు (రూ.26.67లక్షలు) చెల్లించింది. దీనికోసం ఆమె నివాసం ఉంటున్న నాలుగు బెడ్‌రూంల ఇంటిని అమ్మేసింది. అలాగే తనకు సంబంధించిన ఇతర కొన్ని ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టింది. ఇలా తనకు ఉన్నదంతా ఈ ట్రిప్ కోసమే వెచ్చించిందామె. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన క్రూయిజ్ ఇస్తాంబుల్ నుంచి బయల్దేరాలి. కానీ, కంపెనీ వారు దాన్ని 11వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత నవంబర్ 30కి పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. తీరా.. ఇప్పుడు మొత్తానికే ట్రిప్ క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించడంతో కేరికి షాక్ తగిలింది. ఇల్లు అమ్మేసి రోడ్డున పడ్డ తనకు ట్రావెల్ కంపెనీ గట్టి షాక్ ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తనలాగే చాలామంది ఈ ట్రిప్ కోసం భారీగా చెల్లించారని కెరీ తెలిపింది. ఇప్పడు వారందరూ గందరగోళంలో పడిపోయారందామె. ఇక ప్రయాణీకులు చెల్లించిన మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి ఇస్తామని ట్రావెల్ కంపెనీ ప్రకటించింది.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.