Viral Video: ఇలాంటి కారును ఇప్పటిదాకా అస్సలు చూసి ఉండరు.. టైర్లు లేకున్నా రోడ్డుపై ఎలా దూసుకెళ్తోందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-06-28T16:49:19+05:30 IST
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కొందరు తమ సృజనాత్మకతకు పదును పెట్టి.. వినూత్న ఆవిష్కరణలను మన ముందుకు తెస్తున్నారు. వీటిలో కొన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నింటిని చూస్తే.. అరె! ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను గతంలో...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కొందరు తమ సృజనాత్మకతకు పదును పెట్టి.. వినూత్న ఆవిష్కరణలను మన ముందుకు తెస్తున్నారు. వీటిలో కొన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నింటిని చూస్తే.. అరె! ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను గతంలో చాలా చూశాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. టైర్లు లేకున్నా రోడ్డుపై దూసుకెళ్తునన్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు వినూత్నమైన కారును (car) తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ కారు చూసేందుకు సగం భూమిలో కూరుకుపోయినట్లుగా కనిపిస్తుంది. టైర్లు, ఇంజిన్ లేకుండా (car without tires and engine) ... కేవలం సగ భాగం మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. అయినా కారు మాత్రం రోడ్డుపై దూసుకుపోతూ ఉండడం చూసి పక్కన ఉన్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారు లోపల డ్రైవర్ ఉన్నారా, లేక రిమోట్‍తో ఆపరేట్ చేస్తున్నారా అనే అనుమానం కలిగింది. అయితే కారు తయారీకి సంబంధించిన వీడియోను సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో చూస్తే.. ఆ కారులో ఓ వ్యక్తి పడుకుని డ్రైవింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కారు ముందు భాగంలో అమర్చిన కెమెరా సాయంతో లోపల పడుకున్న వ్యక్తి కారును నడపడం చూడొచ్చు. అలాగే కొన్నిసార్లు కూర్చుని కూడా కారును డ్రైవ్ చేస్తాడు. చిన్న చిన్న టైర్లు ఏర్పాటు చేయడం వల్ల పైకి చూసేందుకు.. ఎలాంటి టైర్లు లేనట్లు కనిపిస్తుంది. 'ప్రపంచంలోనే అతి తక్కువ కారు' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.