కారు కిందకు దూరిన కుక్క పారిపోయిందనుకున్నారు.. 70 కిలోమీటర్ల తర్వాత ఇంజన్ నుంచి సౌండ్ రావడంతో ..
ABN , First Publish Date - 2023-02-05T21:27:41+05:30 IST
కొన్ని ఘటనలు చూస్తే, ఇది ఎలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కొందరు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..
కొన్ని ఘటనలు చూస్తే, ఇది ఎలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కొందరు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ చక్కర్లు కొడుతోంది. కారు కిందకు దూరిన కుక్క పారిపోయిందనుకున్నారు. అయితే 70 కిలోమీటర్ల తర్వాత ఇంజన్ నుంచి సౌండ్ రావడంతో తెరచి షాక్ అయ్యారు. ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని (Karnataka) పుత్తూరు తాలూకా కబాక ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం.. తన భార్యతో కలిసి కారులో సుబ్రహ్మణ్య స్వామి (Subrahmanya Swami) ఆలయాన్ని సందర్శించారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. సుళ్య లాలూకా బల్పా గ్రామం వద్ద సడన్‌గా వారి కారు కిందకు ఓ కుక్క (dog) దూరింది. దీంతో వెంటనే అతను కారు ఆపాడు. దిగి చూడగా కుక్క ఎక్కడా కనిపించిలేదు. వెళ్లిపోయిందేమో అనుకుని అక్కడి నుంచి నేరుగా 70కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇంటికి వచ్చారు. అయితే తీరా ఇంటికి వచ్చాక.. దెబ్బతిన్న కారు ముందు భాగాన్ని పరిశీలిస్తుండగా.. ఇంజిన్ నుంచి ఏవో సౌండ్లు వినపడ్డాయి.
చివరకు పరిశీలించగా లోపల కుక్క ఉన్నట్లు గుర్తించారు. కిందకు దూరిన కుక్క బంపర్ మధ్యలోకి ఎలా వెళ్లిందో అర్థం కాక షాక్ అయ్యారు. బయటికి తీయడానికి సాధ్యం కాక.. చివరకు షెడ్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో చివరకు వారు అతి కష్టం మీద కారు ముందు భాగాన్ని తొలగించారు. లోపల కుక్క క్షేమంగా ఉండడాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. కేవలం చిన్న చిన్న గాయాలతో కుక్క బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించిన విడియో సోషల్ మీడియాలో (Viral videos) వైరల్ అవుతోంది. ఇది అద్భుతం అంటూ కామెంట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.