Viral Video: దేనికైనా టైమ్ రావాలంటే ఇదేనేమో.. పగ తీర్చుకునేందుకు ఓపిగ్గా ఎదురుచూసి చివరకు ఈ గాడిద ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2023-02-09T20:21:54+05:30 IST
నోరు లేని మూగజీవాలే కదా.. అని రాక్షసంగా ప్రవర్తించేవారు, కొన్నిసార్లు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్చుకుంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కుక్కకు ఏమో గానీ.. ఇక్కడ మాత్రం గాడిదకు టైం వచ్చింది. పగ తీర్చుకునేందుకు..
ప్రతి కుక్కకూ ఓ రోజు టైం వస్తుంది.. అని పెద్దల సామెత. ఈ సామెతను నిజం చేస్తూ.. మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నన్నేం చేస్తారులే.. అని అహంకారంతో విర్రవీగే వారు ఏదో ఒక రోజు గురపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇది మనుషులకే కాకుండా జంతువులకూ వర్తిస్తుంది. నోరు లేని మూగజీవాలే కదా.. అని రాక్షసంగా ప్రవర్తించేవారు, కొన్నిసార్లు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్చుకుంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కుక్కకు ఏమో గానీ.. ఇక్కడ మాత్రం గాడిదకు టైం వచ్చింది. పగ తీర్చుకునేందుకు ఓపిగ్గా ఎదురుచూసిన గాడిద.. చివరకు ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువకుడు.. తన రాక్షసత్వాన్ని గాడిదపై (Donkey) ప్రదర్శిస్తాడు. గాడిదే కదా.. ఏం చేస్తుందిలే.. అనుకుని పదే పదే దాని మూతిపై విపరీతంగా (Attack on donkey) కొడతాడు. అంతటితో ఆగకుండా కాలితో కూడా తన్ని శాడిజాన్ని ప్రదర్శిస్తాడు. అప్పటికీ గాడిదపై కనికరం చూపని అతను.. దానిపై ఎక్కి సవారీ చేయడం ద్వారా.. తన సరదాను తీర్చుకోవాలని అనుకుంటాడు. అప్పటికే విపరీతమైన కోపంతో ఉన్న గాడిద.. యువకుడు (young man) పైకి ఎక్కగానే మరింత ఆగ్రహానికి గురవుతుంది. అనవసరంగా నన్ను ఇంతగా బాధపెడతావా.. ఉండు! నీ పని చెబుతా.. అన్నట్లుగా, ఒక్కసారిగా యువకుడి కాలును నోటితో పట్టుకుంటుంది.
దెబ్బకి అతడికి చుక్కలు కనపడతాయి. వదులు, వదులు.. అంటూ గాడిదపై మళ్లీ దాడి చేస్తాడు. అయినా వదలిపెట్టని గాడిద.. రౌండ్లు రౌండ్లు తిప్పుతూ యువకుడిని కింద పడేస్తుంది. కాలిని గట్టిగా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుంది. దీంతో, వామ్మో! ఓరి నాయానో.. ఓరి దేవుడో.. చచ్చాన్రో... అంటూ దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెడతాడు. అయినా గాడిద మాత్రం శాంతించకుండా.. యువకుడికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తగిన శాస్తి జరిగింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.