Viral Video: ప్రేమికుల వద్దకు వచ్చిన యువతి.. సడన్‌గా యువకుడికి ముద్దు పెట్టి వెళ్లింది.. చివర్లో ప్రేయసి ఎక్స్ప్రెషన్ చూస్తే..
ABN , First Publish Date - 2023-03-05T17:05:22+05:30 IST
పెళ్లిళ్లలో డాన్సులు చేయడం, వధూవరులను సరదాగా ఆటపట్టించడం, సడన్‌గా జన సందోహంలోకి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేసే యువతులను చాలా మందిని చూశాం. బహిరంగ ప్రదేశాల్లో కొందరు యువతులు చేసే పనులు..
సోషల్ మీడియాలో పెళ్లిళ్లు, ప్రేమికులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. పెళ్లిళ్లలో డాన్సులు చేయడం, వధూవరులను సరదాగా ఆటపట్టించడం, సడన్‌గా జన సందోహంలోకి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేసే యువతులను చాలా మందిని చూశాం. బహిరంగ ప్రదేశాల్లో కొందరు యువతులు చేసే పనులు చూసి జనం అవాక్కవుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇటీవల చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిందే. ప్రేమికులు ఓ హోటళ్లో ఉండగా.. ఓ యువతి సడన్‌గా లోపలికి వెళ్లింది. సడన్‌గా యువకుడికి ముద్దు పెట్టి వెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా (Viral videos) మారింది. ఇద్దరు ప్రేమికులు (lovers) హోటళ్లో భోజనం చేస్తూ.. సరదాగా భోజనం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ యువతి (young woman) లోపలికి వచ్చింది. ఉన్నట్టుండి యువకుడిని తల పట్టుకుని, పెదవులపై ముద్దు పెడుతుంది. దీంతో ఒక్కసారిగా పక్కన ఉన్న వాళ్లు కూడా అవాక్కవుతారు. ముద్దు (kiss) పెట్టిన యువతి వెళ్తూ వెళ్తూ యువకుడి పక్కన ఉన్న ప్రేయసి తల మీద గట్టిగా కొడుతుంది. తర్వాత అక్కడ నుంచి తాపీగా వెళ్లిపోతుంది.
ఊహించని ఈ ఘటనతో హోటళ్లో ఉన్న వారితో పాటూ యువకుడి ప్రేయసి కూడా షాక్ అవుతుంది. యువకుడి వైపు చూసి.. ‘‘ఏంటిది.. ఎవరీమె.. అసలు ఏం జరుగుతోంది’’.. అన్నట్లుగా నోరు తెరచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ యువతి ఎవరో గానీ చాలా ఫాస్ట్‌గా ఉంది.. అని కొందరు, ఆమె వెళ్లాక యువకుడి పరిస్థితి ఏంటో.. అని ఇంకొందరు, ఇది ప్రాంక్ అయి ఉంటుంది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.