Viral Video: కుక్కలను చూసి పరుగందుకున్న సింహం.. అయినా వదలని గ్రామ సింహాలు.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-03-22T20:30:34+05:30 IST
‘‘అనువుగాని చోట అధికులమనరాదు’’.. అని వేమన ఏనాడో చెప్పాడు. స్థాన బలం లేకున్నా.. విర్రవీగడం వల్ల చివరికి మొదటికే మోసం వస్తుంది. ఇది మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుంది..
‘‘అనువుగాని చోట అధికులమనరాదు’’.. అని వేమన ఏనాడో చెప్పాడు. స్థాన బలం లేకున్నా.. విర్రవీగడం వల్ల చివరికి మొదటికే మోసం వస్తుంది. ఇది మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుంది. నీటిలో ఉండే మొసలి.. ఎంత పెద్ద జంతువునైనా ఈజీగా వేటాడుతుంది. అదే ఒడ్డున ఉంటే చిన్న చిన్న జంతువుల చేతిలో కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అడవికి రాజైన సింహానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జనసంచారంలోకి అడుగుపెట్టిన సింహాన్ని కుక్కలు తరిమి తరిమి కొట్టాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్‌లో (Gir Somnath) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సింహం (lion) అడవి నుంచి మార్చి 22న రాత్రి సోమ్‌నాథ్ ప్రాంతంలోకి వచ్చింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే సింహాన్ని గమనించిన కొన్ని కుక్కలు .. గట్టిగా మొరుగుతూ (Dogs attack lion) వెంబడించాయి. దీంతో సింహం ఒక్కసారిగా బిత్తరపోయింది. ‘‘ఇక్కడ ఉండడం సేఫ్ కాదు.. ఈ కుక్కలకు చిక్కితే చంపినా చంపుతాయ్ బాబోయ్’’!.. అన్నట్లుగా వాటికి దొరక్కుండా పరుగు లంగించుకుంటుంది. అయినా కుక్కలు వదలకుండా.. ‘‘ నువ్వు సింహం అయితే.. మేం గ్రామ సింహాలం’’.. అన్నట్లుగా వెంటపడతాయి.
కాస్త దూరంలో కొన్ని ఆవులు.. సింహం రాకను చూసి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాయి. ఈ ప్రాంతంలోకి వన్యప్రాణులు చొరబడడం ఇదేం కొత్త కాదు. ఫిబ్రవరిలోనూ సోమ్‌నాథ్ ప్రాంతంలోకి సింహాలు చొరబడ్డాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి సింహాన్ని తరిమిన కుక్కల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది చాలా అరుదైన సంఘటన.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.
Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..