Viral Video: భార్యతో కలిసి విమానం ఎక్కి.. మరో మహిళ రాగానే ఓ భర్త చేసిన నిర్వాకమిదీ.. ప్రయాణీకులంతా హడలిపోయారుగా..!
ABN , First Publish Date - 2023-05-06T13:31:19+05:30 IST
దూర ప్రయాణానికి వెళ్లాలనుకున్నప్పుడు ఎవరైనా సరే నెల ముందో.. లేదంటే రెండు నెలల ముందో రిజర్వేషన్ చేసుకుంటాం. వీలుంటే మనకు నచ్చిన చోట సీటు
దూర ప్రయాణానికి వెళ్లాలనుకున్నప్పుడు ఎవరైనా సరే నెల ముందో.. లేదంటే రెండు నెలల ముందో రిజర్వేషన్ చేసుకుంటాం. వీలుంటే మనకు నచ్చిన చోట సీటు దొరికేలా బుక్ చేసుకుంటాం. లేదంటే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చుని జర్నీ చేస్తుంటాం. ఇలా అనుకూలతను బట్టి ఏర్పాట్లు చేసుకుంటాం. ఒకవేళ అంతకీ వీలైన చోట సీటు దొరక్కపోతే.. ట్రైన్ ఎక్కాకో.. లేదంటే ఫ్లైట్ ఎక్కాకో పరిస్థితులను బట్టి తోటి ప్రయాణికులను రిక్వెస్ట్ చేసి అడ్జెస్ట్ చేసుకుంటాం. ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఎదురవుతుంటాయి. ఇక కొన్ని సార్లు అయితే అనుకోకుండానే ముష్టి యుద్ధాలు జరిగిపోతుంటాయి. ఎక్కువగా పల్లెటూరు బస్సుల్లోనో... లేదంటే రైల్లోనో ఇలాంటి ఘటనలు విరివిగా జరుగుతుంటాయి. ఈ కల్చర్ విమానాల్లోకి కూడా పాకింది. ఏదో సామాన్యులు అజ్ఞానంతో తెలియక కొట్టుకుంటున్నారంటే అర్థముంది. కానీ విద్యావంతులు కూడా ఫైటింగ్‌లకు దిగడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇదంతా ఎందుకుంటారా? తాజాగా ఓ విమానంలో జరిగిన కొట్లాట చూస్తుంటే... వీళ్లు చదువుకున్న వాళ్లా? లేదంటే రౌడీలా? ఏమనాలి.
ఓ విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అలాంటి సమయంలో సీటు కోసం వివాదం రేగింది. ఆగ్రహానికి గురైన ఓ ప్యాసింజర్.. విమాన సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా అత్యవసర ద్వారం దగ్గరకు వెళ్లి దూకే ప్రయత్నం చేశాడు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారాయి.
అమెరికా (America)లోని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో హూస్టన్ (Houston)కు వెళ్లే విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా ఫ్లైట్ ఎక్కుతూ సీట్లు వెతుక్కుంటున్నారు. జిమెనెజ్ అనే ఓ ప్రయాణికురాలు కూడా విమానం ఎక్కారు. బెంజమిన్ లోవిన్స్ అనే ప్రయాణికుడి భార్య తన సీటులో కూర్చోవడం ఆమె గమనించింది. ఆ సీటు (flight over seats) తనదని మీకు కేటాయించిన సీట్లో కూర్చోవాలంటూ భార్యాభర్తలకు ఆమె సూచించింది. కానీ వారు మాత్రం సీటు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె విమాన సిబ్బందికి విషయం తెలియజేసింది. సిబ్బంది వచ్చి లోవిన్స్ భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో వివాదం మొదలైంది (passengers). దీంతో లోవిన్స్ మధ్యలో కల్పించుకుని కేకలు వేయడం ప్రారంభించాడు. ఆగ్రహంతో ఊగిపోయి సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి తెగబడ్డాడు. పిడిగుద్దులు గుద్దుతూ వీరంగం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పైలెట్ ఉండే చోటుకు వెళ్లి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేశాడు. అందులోంచి బయటకు దూకేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో తోటి ప్రయాణికులు అతడిని కట్టడి చేసి వెనక్కి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇక అతడి ప్రవర్తనను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా తీవ్రంగా పరిగణించింది. అతడు భవిష్యత్తులో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ విషయాలన్నీ విమానంలో ఉన్న మరో ప్రయాణికురాలు మీడియాకు వివరించి చెప్పింది.