Viral News: 27 ఏళ్ల వయసుకే రూ.100 కోట్ల బిజినెస్.. యూపీఎస్సీ రాసి ఫెయిల్ అయితే.. టీ షాపు పెట్టుకుని కోట్లలో సంపాదన..!

ABN , First Publish Date - 2023-07-07T16:22:18+05:30 IST

డబ్బుసంపాదించాలంటే కష్టపడాలి అంటారంతా.. కానీ కష్టపడుతున్నవారెవ్వరూ కోట్లు కాదు కదా లక్షలు కూడా వెనకేసుకోలేకపోతున్నారు. పోనీ విద్యార్హత ఎక్కువ ఉంటే డబ్బు సంపాదన సులువు అవుతుందా? దేశంలో విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య వెక్కిరిస్తుంది . మరి డబ్బు సంపాదించడానికేం కావాలి?

Viral News: 27 ఏళ్ల వయసుకే రూ.100 కోట్ల బిజినెస్.. యూపీఎస్సీ రాసి ఫెయిల్ అయితే.. టీ షాపు పెట్టుకుని కోట్లలో సంపాదన..!

డబ్బుసంపాదించాలంటే కష్టపడాలి అంటారంతా.. కానీ కష్టపడుతున్నవారెవ్వరూ కోట్లు కాదు కదా లక్షలు కూడా వెనకేసుకోలేకపోతున్నారు. పోనీ విద్యార్హత ఎక్కువ ఉంటే డబ్బు సంపాదన సులువు అవుతుందా? దేశంలో విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య వెక్కిరిస్తుంది . మరి డబ్బు సంపాదించడానికేం కావాలి? ఇదిగో 27ఏళ్ళ అనుభవ్ ను, అతని అనుభవాన్ని కదిలిస్తే 'డబ్బు సంపాదించడం ఎలా?' అనే విషయం చక్కగా అర్థమవుతుంది. ఓ టీ షాపు పెట్టి 100కోట్ల మార్కెటింగ్ స్థాయికి ఎదిగిన ఈ కుర్రాడి గురించి పూర్తీగా తెలుసుకుంటే..

అనుభవ్ దూబే(Anubhav Dubey)1996 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం(Madhya Pradesh), రేవా జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి రియల్ ఎస్టేస్ ఏజెంట్(father real estate agent). అభినవ్ మొదట తన తండ్రి బాటలోనే రియల్ ఎస్టేట్ లో కొనసాగాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అతను మాత్రం ఐఐటీ(IIT), ఐఐఎమ్(IIM), యూపీయస్సీ(UPSC) వంటి గోల్స్.. లేక సిఏ(C.A) చేసి మంచి భవిష్యత్తును వెతుక్కోవాలని అనుకున్నాడు. కానీ వీటన్నింటికి బదులుగా అతను ఇండోర్ లోని కాలేజీలో బి.కామ్(B.com) లో చేరాడు. అతను డిగ్రీ చదువుతుండగానే అతనికి ఆనంద్ నాయక్(Anand Nayak) పరిచయమయ్యాడు. వీరిద్దరి ఆలోచనలు, అభిరుచులు ఇంచుమించు ఒకేలా ఉండేవి. దీంతో వీరు చాలామంచి ఫ్రెండ్స్ అయ్యారు. డిగ్రీ పూర్తయిన తరువాత అనుభవ్ యూపీయస్సీ కి ప్రిపేర్ కావడానికి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఎంత శ్రద్దగా చదివినా యూపీయస్సీలో సక్సెస్ కాలేకపోయాడు. ఏం చేసినా ఫలితం లేకపోవడంతో అతనిలో సంఘర్షణ మొదలయ్యింది. ఈ క్రమంలోనే అతని డిగ్రీ స్నేహితుడు ఆనంద్ కలిశాడు. వారిద్దరూ కలిసి చాలా ఆలోచించారు.

Wife: భార్య వాట్సప్ చాటింగ్‌ను ఫొటోలు తీసుకుని మరీ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. గుడికి వెళ్లి వస్తానని చెప్పి..!


ఇండోర్ నగర ప్రజలకు టీ అంటే వల్లమాలిన ప్రేమ. ఎక్కడ టీ దుకాణం కనిపించినా, టీ బాగుందని తెలిసినా అక్కడికెళ్ళిపోయి టీ చప్పరిస్తుంటారు. ఈ ఆలోచనల్లో పుట్టినదే చాయ్ సుత్తా బార్ టీ దుకాణం. స్నేహితులిద్దరూ కలిసి 3లక్షల రూపాయలను పోగుచేసుకుని తక్కువ ధరలో సెకెండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనుగోలు చేశారు. ఇండోర్ లో గర్ల్స్ హాస్టల్ సమీపంలో టీ దుకాణం ప్రారంభించారు. దీనికి 'చాయ్ సుత్తా బార్'(chai sutta bar) అని నామకరణం చేశారు. మొదట్లో స్టాల్ కు పెద్దగా జనం రాలేదు. కానీ ఆ తరువాత మౌత్ టాక్ బాగా పనిచేసింది. ఆ నోటా ఈ నోటా చాయ్ సుత్తా బార్ గురించి ప్రజలకు తెలిసింది. వీరి టీ దుకాణంలో వేడి వేడి టీని మట్టి కప్పులలో అందించడం ప్రజలకు బాగా నచ్చింది. 20రుచుల టీ వీరి దగ్గర లభిస్తుంది. కాలేజీ కుర్రాళ్ళను, యువతను చాయ్ సుత్తా బార్ బాగా ఆకర్షించింది. తరువాత క్రమక్రమంగా ఎదుగుతూ ఇప్పుడు భారతదేశంలోనూ ఇతర దేశాలలోనూ కలిపి 150 అవుట్ లెట్ లకు చేరుకుంది. ఈ టీ దుకాణం ఆదాయం తాజాగా 100కోట్ల మార్కు దాటింది. చాయ్ సుత్తా బార్ ఇప్పుడు టీ ఫ్రాంచైజీ పరిశ్రమలో ప్రముఖ బ్రాండ్ గా మారింది. ఇంత పెద్ద సక్సెస్ సాధించిన అభినవ్ మేనేజ్మెంట్స్ స్కూల్స్ కు ప్రసంగాలు ఇవ్వడానికి కూడా ఆహ్వానించబడుతున్నాడు. డబ్బు సంపాదించడం ఎలా? అని తర్జభర్జన పడేవారికి అనుభవ్ జీవితం గొప్ప ప్రేరణ.

Big Mistake: షాపింగ్ మాల్స్‌లో ఎస్కలేటర్‌పై పిల్లల్ని తీసుకెళ్తున్నారా..? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి..!


Updated Date - 2023-07-07T16:22:18+05:30 IST