Share News

Viral News: 92ఏళ్ల భర్తను కలవడానికి 80ఏళ్ళ భార్య చేసిన కోర్టు పోరాటం.. అసలింతకీ వీళ్ళ కథేంటంటే..

ABN , First Publish Date - 2023-10-20T13:52:15+05:30 IST

భార్యాభర్తలు తమ అవసాన దశలో ఒకరి తోడు మరొకరు కోరుకుంటారు. తన 92ఏళ్ళ భర్తను కలవడానికి. అతనితో కలసి జీవించడానికి 80ఏళ్ల వృద్దురాలు కోర్టు మెట్లు ఎక్కింది.

Viral News: 92ఏళ్ల భర్తను కలవడానికి 80ఏళ్ళ భార్య చేసిన కోర్టు పోరాటం.. అసలింతకీ వీళ్ళ కథేంటంటే..

ఈ ప్రపంచంలో తల్లీబిడ్డల అనుబంధం తరువాత ప్రాధాన్యత కలిగినది భార్యాభర్తల బంధానికే. ఈ బంధం మధ్యలో ముడిపడి జీవితాంతం తోడుంటుంది. భార్యాభర్తలు ముఖ్యంగా తమ అవసాన దశలో ఒకరి తోడు మరొకరు కోరుకుంటారు. తన 92ఏళ్ళ భర్తను కలవడానికి. అతనితో కలసి జీవించడానికి 80ఏళ్ల వృద్దురాలు కోర్టు మెట్లు ఎక్కింది. ఆమె తన పరిస్థితిని వివరించి తన కోరిక తీర్చమంటూ కోర్టును మొరపెట్టుకుంది. ఈ వృద్దురాలి కేసు విచారణ చేసిన కోర్టు తీర్పు కూడా వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలు, ఈ భార్యాభర్తల కథ పూర్తీగా తెలుసుకుంటే..

కేరళ(Kerala) రాష్ట్రానికి ఓ భార్యాభర్తల కేసు అందరినీ కదిలిస్తోంది. 92ఏళ్ల వ్యక్తి చిత్తవైకల్యంతో, బుద్దిమాంధ్యంతో భాదపడుతోంటే అతని కొడుకు అతన్ని తన ఇంట్లో నిర్బంధించాడు. ఆయన్ను ఎవరూ కలవకుండా ఉండేలా ఏర్పాటుచేశాడు. దీంతో 92ఏళ్ళ వృద్దుడి భార్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తన భర్తను తిరిగి కావాలనే కోరికను వెలిబుచ్చుతూ కోర్టులో పిటిషన్ వేసింది. తన భర్తకు ఇంతకు ముందే చిత్తవైకల్యం సమస్య ఉన్నా అతను తనతో బాగానే ఉండేవాడని ఆమె కోర్టులో తన వాదన వినిపించింది. భర్తకు ఎంత అనారోగ్యం ఉన్నా అతనికి మానసిక ఊరట భాగస్వామి దగ్గర లభిస్తుందని అందుకే ఆమెకు తన భర్తను దగ్గర చెయ్యాలని ఆమె తరపున లాయర్ కూడా న్యాయమూర్తుల ముందు తెలిపాడు.

Viral News: అది కారా.. లేక టపాసుల దుకాణమా.. రోడ్డుపై వెళ్తూ వీరు చేసిన పని తెలిస్తే..



ఆ కేసును కేరళ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రన్ తో కూడిన సింగిల్ బెంచ్ విచారించి ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో సదరు మహిళ తన భర్తను తిరిగి కలవచ్చని పేర్కొంది. మానసిక పరిస్థితి బాగాలేకపోయినంత మాత్రాన ఆయన్ను అలా నిర్భందించడం సరైన పద్దతి కాదని తెలిపింది. వెంటనే కేరళలోని నెయ్యట్టింకరలోని తన ఇంటికి ఆయన్ను తీసుకెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సదరు వ్యక్తి కొడుకు కోర్టులో పిటిషన్ వేశాడు. తన తండ్రిని బయట ఉంచడం ద్వారా తను ఇరుగు పొరుగు నుండి మాటలు పడాల్సి వస్తోందని అందులో పేర్కొన్నాడు. తన తల్లి వయసు కూడా పెద్దదే కావడంతో ఆమె తన తండ్రిని సరిగా చూసుకోలేకపోతోందని వివరించాడు. తన తండ్రి మెయింటెన్స్ ఖర్చులకు తనకు డబ్బు కావాలని పిటిషన్ లో తెలిపాడు. అయితే అతని పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అవసాన దశలో భార్యాభర్తలు దగ్గరగా ఉంటేనే వారికి మానసికంగా మంచిదని తీర్పు ఇచ్చింది.

Viral Video: రోజూ ఏదో కుడుతున్నట్లు ఉన్నా మొదట అనుమానం రాలేదు.. చివరకు ఓ రోజు ఇంటి సీలింగ్ బద్ధలుకొట్టి చూస్తే..


Updated Date - 2023-10-20T13:52:15+05:30 IST