Viral News: ఆ ప్రియుడికి ఇంత ఇగో ఏంటీ..? గుడ్ బై చెప్పండంటూ ఆ యువతికి నెటిజన్ల సలహాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-06-28T17:00:39+05:30 IST

ప్రేమికుల మధ్య ప్రేమ మాత్రమే కాదు. గొడవలు, అపార్థాలు, అపోహలు ఎన్నో కలుగుతుంటాయి. అలిగిన భాగస్వామిని చల్లబరచడం అంత ఈజీ కాదు. ఓ ప్రేమ జంటకు ఇలాంటి విషమ పరీక్షే ఎదురైంది.

Viral News: ఆ ప్రియుడికి ఇంత ఇగో ఏంటీ..? గుడ్ బై చెప్పండంటూ ఆ యువతికి నెటిజన్ల సలహాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ప్రేమికుల మధ్య ప్రేమ మాత్రమే కాదు. గొడవలు, అపార్థాలు, అపోహలు ఎన్నో కలుగుతుంటాయి. అలిగిన భాగస్వామిని చల్లబరచడం అంత ఈజీ కాదు. ఓ ప్రేమ జంటకు ఇలాంటి విషమ పరీక్షే ఎదురైంది. ప్రియుడికి తన ప్రియురాలిమీద కోపం వచ్చింది. ఆ ప్రియుడిని బుజ్జగించి అతని కోపం చల్లార్చడానికి ఆమె చేసిన ప్రయత్నం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె చేసిన పని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరు 'ఆ ప్రియుడికి మరీ ఇంత ఇగో ఏంటీ? అతనికి గుడ్ బై చెప్పేయండి' అని అంటున్నారు. ప్రియుడిమీద అందరూ అంత పైర్ కావడం వెనుక కారణం ఏంటి? తన ప్రియుడికోపం చల్లబరచడానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటి? తెలుసుకుంటే..

శరీరానికి అయిన గాయం తొందరగా మానుతుందేమో కానీ మనసుకు అయిన గాయం అంత సులువుగా పోదన్నది అనుభవజ్ఞుల మాట. ఇక మనకెంతో కావాల్సిన వారు మనసును నొప్పిస్తే కోలుకోవడం కష్టం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(Uttara Pradesh) నోయిడా(Noida)లో ప్రేమజంట మధ్య ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన సుష్ అనే పేరు కలిగిన అమ్మాయి సంజు అనే కుర్రాడిని ప్రేమించింది. వారిమధ్య ఏ గొడవలు జరిగాయో.. మరే పొరపొచ్చాలు వచ్చాయో కానీ ప్రియుడి మనసు గాయపడింది. ఆమె తన ప్రియుడిని ఎన్నో రకాలుగా బుజ్జగించింది కానీ అతను కూల్ కాలేదు. దీంతో ఆమె వింతగా ఆలోచించింది. అతనికి సారీ చెబుతూ ఓ బిల్ బోర్డ్ తయారుచేయించింది. నోయిడాలోని సెక్టార్ 125, ఓఖ్లా బర్డ్ శాంక్చురీ మెట్రో స్టేషన్(sector 125, oklha bird sanctuary in noida) కు సమీపంలో ఈ బిల్ బోర్డ్(bill board) ఏర్పాటుచేయించింది. అందులో 'ఐయామ్ సారీ సంజూ ఇంకెప్పుడూ నిన్ను అంతలా బాధపెట్టను' అంటూ రాసుంది. ఆ బోర్డ్ లోనే ఆ కుర్రాడి చిన్ననాటి ఫోటోలు కూడా పెట్టించింది. ఇలా పబ్లిగ్గా సదరు ప్రియురాలు తన ప్రియుడికి క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం ఈ బిల్ బోర్డ్ ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Beer Omelette: నూనెకు బదులు బీరుతో ఆమ్లెట్.. ఎలా చేశారని డౌటా..? ఈ వీడియోను చూస్తే..!


ఈ ఫోటోను aparna అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఓ అమ్మాయి.. సంజు కోపం, అహం పోగొట్టడానికి బిల్ బోర్డ్ మీద ఖర్చు చేయకుండా మ్యూచువల్ ఫండ్స్ నుండి ఖర్చు చేస్తే బాగుండు. కొన్నినెలల తరువాత నీకు ఈ విషయం అర్థం అవుతుంది' అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. 'ఇందుకే నోయిడా నగరం చాలా పేమస్ అయిపోతోంది' అంటూ సెటైర్ వేశారు. 'ఆ ప్రియుడికి అంత ఇగో ఎందుకు? అతనిక గుడ్ బై చెప్పేయండి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఎదుటివారి మనసు గాయం లోతు వారికి మాత్రమే తెలుస్తుంది' అని మరికొందరు అంటున్నారు.

Interesting Facts: 241553903 .. ఈ నెంబర్‌ను గూగుల్‌ సెర్చ్ చేస్తే షాకింగ్ సీన్లు.. ఫ్రిజ్‌లో తలపెట్టిన ఫొటోలే కనిపించడం వెనుక..!


Updated Date - 2023-06-28T17:26:13+05:30 IST