Viral News: అదృష్టమంటే ఈ పిల్లాడిదే.. 14ఏళ్ళకే ఉద్యోగం.. ఎందులోనో తెలిస్తే షాకవుతారు.

ABN , First Publish Date - 2023-06-12T10:59:22+05:30 IST

ప్రస్తుత కాలంలో మంచి మెరిట్ ఉన్నా అవకాశాల్లేక కిందామీదా అవుతున్నవారు చాలామంది ఉన్నారు. కానీ 14ఏళ్ళకే ఉద్యోగానికి ఎంపిక కావడం అంటే మాటలు కాదు. అది కూడా ఏకంగా..

Viral News: అదృష్టమంటే ఈ పిల్లాడిదే.. 14ఏళ్ళకే ఉద్యోగం.. ఎందులోనో తెలిస్తే షాకవుతారు.

ఉద్యోగం పురుష లక్షణం అనే మాట వినే ఉంటారు కానీ ఉద్యోగం ఈ పిల్లాడి లక్షణమయ్యింది. ప్రస్తుత కాలంలో మంచి మెరిట్ ఉన్నా అవకాశాల్లేక కిందామీదా అవుతున్నవారు చాలామంది ఉన్నారు. కానీ 14ఏళ్ళకే ఉద్యోగానికి ఎంపిక కావడం అంటే మాటలు కాదు. అది కూడా ఏకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కంపెనీ ఏరికోరి ఈ పిల్లాడిని ఎంచుకుంది. ఈ ఒక్కవిషయంతో ఈ పిల్లాడి ప్రతిభ ఎలాంటిదో ఓ అంచనాకు వచ్చేయచ్చు. అసలింతకూ ఈ 14ఏళ్ళ పిల్లాడు ఎవరు? ఇతని కథ ఏంటి పూర్తీగా తెలుసుకుంటే..

అమెరికాలోని(America) కాలిఫోర్నియాలో కరెన్ కాజీ(Kairan Quazi) అనే పిల్లాడు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. కరెన్ మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఆ పిల్లాడు తోటి విద్యార్థులకంటే చాలా వేగంగా నేర్చుకోవడం తరగతి ఉపాధ్యాయులు గమనించారు. ఆ తరువాత ఆ పిల్లాడిని చిన్నపిల్లల వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళగా ఆ పిల్లాడి ఐక్యూ లెవల్స్(amazing IQ levels) గమనించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ పిల్లాడిని పై తరగతులకు రిఫర్ చేశారు. మంచి ఐక్యూతో పాటు కరెన్ కు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండటంతో అతనిలో మానసిక పరిణితి కూడా తన వయసు పిల్లలకంటే ఎక్కువగానే ఉంది. దీంతో అతను 9సంవత్సరాల వయసులో లాస్ పోసిటాస్ కమ్యూనిటీ కాలేజీకి వెళ్ళాడు(collage education at 9years old). అక్కడ రెండేళ్ళు చదివిన తరువాత 11ఏళ్ళ వయసులో శాంటా క్లారా యూనివర్సిటీలో(Santa Clara university) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో(computer science & engineering) జాయిన్ అయ్యాడు. ఇంకొక వారంలో ఈ పిల్లాడి గ్రాడ్యుయేషన్ పూర్తీ కానుంది. (14 years graduate)

Viral Video: మొబైల్ మాయలో పడిన ఓ తల్లి చేసిన నిర్వాకం.. జరిగిందేంటో తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు..


గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే ఈ పిల్లాడు ఇంటెల్ ల్యాబ్స్ లో ఇంటర్న్ గా పనిచేశాడు. ఈ ప్రతిభ కారణంగా కరెన్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ లో(SpaceX Elon Musk company) సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరబోతున్నాడు. ఇతని గురించి తెలిసి ప్రపంచమే విస్తుపోతోంది. కాగా కొంతమంది మాత్రం ఈ పిల్లాడు తన బాల్యాన్ని కోల్పోతున్నాడు అంటున్నారు. దీనికి సమాధానంగా కరెన్ 'నేనేమీ నా బాల్యాన్ని కోల్పోలేదు, నాకు ఇలా చదువుకోవడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థలో నేను సాప్ట్వేర్ ఇంజనీర్ గా చేరబోతున్నాను' అని చెప్పాడు. కాగా ప్రస్తుతం కరెన్ తన తల్లిలో కలసి కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ కు మారే పనులలో బిజీబిజీగా ఉన్నాడు.

Viral video: ఓ రైతుకు ఇంతకన్నా ఏమి కావాలి.. పొలంలో నిరాశగా కూర్చుని ఉన్న రైతునుచూసి పెంపుడు జంతువులు ఏమి చేశాయంటే..


Updated Date - 2023-06-12T10:59:22+05:30 IST