Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..! | Viral News: Uttar Pradesh Young man theft Shiva ling in temple .. his reason may shock you srn spl

Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..!

ABN , First Publish Date - 2023-09-07T12:20:57+05:30 IST

రోజూ ఎంతో భక్తిగా పూజలు చేసిన కుర్రాడే శివలింగం ఎత్తుకెళ్లాడని తెలియడంతో అందరికీ దిమ్మతిరిగిపోయింది. అసలు అతను శివలింగం ఎత్తుకెళ్ళడం వెనుక గల కారణం తెలిస్తే..

Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..!

శ్రావణ మాసానికి పవిత్రమైన మాసమని పేరు. ఈ మాసం మొత్తం దేవీదేవతల పూజలతో దైవభక్తితో నిండిపోతుంది. పలు ఆలయాలలో దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్మిస్తారు. ఓ గ్రామంలోని ప్రజలు శివుడి దర్శనానికై ఉదయాన్నే శివాలయానికి వెళ్లారు. గుడిలో శివలింగం ఉండాల్సిన చోట ఖాళీగా కనిపించింది. రాత్రికి రాత్రే ఏం జరిగిందో ఏంటోనని అందరూ కంగారు పడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఓ కుర్రాడు శివలింగాన్ని ఎత్తుకెళ్లాడని తెలియడంతో కుర్రాడిని నిలదీశారు. ఆ కుర్రాడి సమాధానం విన్న పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. అతను చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లా మహేవా ఘాట్ ప్రాంతంలో చోటూ అనే కుర్రాడు నివసిస్తున్నాడు. అతని వయసు 27సంవత్సరాలు. అతను తన బంధువులలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం శివుడి ఆశీర్వాదం కావాలని, శివుడిని భక్తిగా ఆరాధిస్తే తన కోరిక నెరవేరుతుందని తనకు తానే నమ్మాడు. తను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుంటానని శివుడి ముందే ప్రతిజ్ఞ చేశాడు. అప్పటినుండి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భక్తి శ్రద్దలతో ఆచార వ్యవహారాలతో శివుడిని పూజించడం మొదలుపెట్టాడు. అతను ఎంతో భక్తిగా శివుడిని పూజించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. 'ఈ కాలం కుర్రాళ్ళలో ఇంత భక్తి చాలా అరుదు' అని చోటూను మెచ్చుకునేవారు.

Tea vs Coffee: టీ, కాఫీలు తాగే అలవాటుందా..? సరిగ్గా 30 రోజుల పాటు వాటిని మానేస్తే జరిగేది ఇదే..!


ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ క్రమంలో ఉదయాన్నే పూజకోసం శివాలయానికి వెళ్లిన కొందరు భక్తులకు గుడిలో శివలింగం కనిపించలేదు. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పరిసరాల గురించి, గుడికి ఎక్కువగా వచ్చేవారి గురించి పోలీసులు వివరాలు సేకరించారు. చోటూ మీద వారికి అనుమానం కలిగింది. ఉదయాన్నే పూజ చేయడం కోసం రావాల్సిన చోటూ గుడికి రాకపోవడం పోలీసుల అనుమానాన్ని మరింత పెంచింది . పోలీసులు చోటూను వెతికి పట్టుకున్నారు. శివలింగాన్ని అతనే తీసుకెళ్లినట్టు ఒప్పుకున్నాడు. శివలింగం ఎందుకు తీసుకెళ్ళావని పోలీసులు అతన్ని అడగగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనే కోరికతో శివుడిని నిష్టగా పూజించానని, కానీ శివుడు తన కోరిక తీర్చలేదని చెప్పాడు. ఆ అమ్మాయి తనకుదక్కలేదని, ఆ కోపంతోనే శివలింగం ఎత్తుకెళ్లినట్టు పోలీసులతో చెప్పుకొచ్చాడు. ఈ మాటలు వినగానే అవాక్కవడం పోలీసుల వంతైంది. అతడిది అమాయకత్వమో, మూర్ఖత్వమో అర్థం కాక పోలీసులు జుట్టు పీక్కున్నారు. గుడిలో శివలింగం ఎత్తుకెళ్ళినందుకు చోటూను అరెస్ట్ చేశారు. శివలింగాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి గుడిలో ప్రతిష్టించారు.

Woman Health: అమ్మాయిలూ.. చిన్న కడుపునొప్పి వచ్చినా డాక్టర్‌ను కలవండంటూ.. ఈ 25 ఏళ్ల యువతి ఎందుకు చెప్తోందంటే..!


Updated Date - 2023-09-07T12:20:57+05:30 IST