Viral: ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వచ్చిందిగా.. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన కవర్‌ను ఓపెన్ చేసి చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-04T13:30:54+05:30 IST

సూపర్ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేశాడొక వృద్దుడు. వండుకుందామని కవర్ తెరిచి షాకయ్యాడు.

Viral: ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వచ్చిందిగా.. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన కవర్‌ను ఓపెన్ చేసి చూస్తే..!

ఓ వృద్దుడు సూపర్ మార్కెెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. తాజాగా ఉన్న బ్రోకలి అయన్ను ఆకర్షించింది.. ఆరోగ్యానికి ఆరోగ్యం, పైగా తాజాగా ఉంది కదా అని బ్రోకలి కొనుగోలు చేశాడు. ఇంటికెళ్ళిన తరువాత బ్రోకలి వండుకుందామని కవర్ తెరిచి షాక్ తిన్నాడు. అతని శరీరం భయంతో వణికిపోయింది. ఈ బ్రోకలికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తున్నాయి. దీని గురింటి పూర్తీగా తెలుసుకుంటే..

ఇంగ్లండ్(England) కు చెందిన నెవిల్లే లింటన్ అనే వృద్దుడికి చాలా భయానక అనుభవం ఎదురయ్యింది. 63 సంవత్సరాల(63years old man) వయసు గల నెవిల్లే లింటన్ కూరగాయలు కొనుగోలు చేసేందుకు స్థానిక సూపర్ మార్కెట్(super market) కు వెళ్ళాడు. అక్కడ తాజాగా ఉన్న బ్రోకలిఅతన్ని ఆకర్షించింది. దీంతో అతను బ్రోకలి కొనుగోలు చేశాడు(broccoli purchase in super market). వాటిని ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో భద్రపరిచాడు. ఆ తరువాత బ్రోకలి వండుకుందామని దాన్ని ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి బ్రోకలి కవర్ తొలగించాడు. బ్రోకలి మధ్య చిన్న పాము నిద్రపోతూ కనిపించింది(baby snake in broccoli). దాన్ని చూడగానే అతను వణికిపోయాడు. భయంతో అతని శరీరమంతా చల్లగా అయిపోయింది. లేని ధైర్యాన్నికూడబెట్టుకుని బ్రోకలి మధ్యలో ఉన్న పామును గమనించాడు. అది గొంగళి పురుగు రంగులో ఎలాంటి గందరగోళం లేకుండా హాయిగా నిద్రపోతూ కనిపోతూ కనిపించింది.

bro.gif

ఆ వృద్దుడు వెంటనే తన చెల్లెలికి ఫోన్ చేసి విషయమంతా చెప్ఫాడు. ఆమె సలహా మీద ఆ బ్రోకలిని జాగ్రత్తగా తీసుకుని సూపర్ మార్కెట్ కు వెళ్ళాడు. 'నేను కొనుగోలు చేసిన బ్రోకలిలో పాము ఉంది' అని సూపర్ మార్కెట్లో చెప్పాడు. ఆ మాట వినగానే దుకాణారుడు 'తమాషా చేస్తున్నారా ఏంటి?' అంటూ నవ్వేశాడు. కానీ వృద్దుడు బ్రోకలిని జాగ్రత్తగా బయటకు తీసి దుకాణాదారుడి ముందు ఉంచాడు. ఆ దుకాణాదారుడు కూడా బ్రోకలిలో ఉన్న పామును చూసి భయపడిపోయాడు. ఈ పాము ప్రమాదకరమైనది కాదని తెలిసింది. కానీ అది కాటు వేస్తే మాత్రం ఆరోగ్య పరిస్థితి దిగజారుతుందని చెబుతున్నారు. ఇలాంటి కూరగాయలు కొనేముందు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

Updated Date - 2023-07-04T13:58:07+05:30 IST