Viral Video: ఈ జింక ఎందుకిలా చేస్తోంది..? ఆ చిన్నారి అసలేం చెప్పింది..? నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న వీడియో ఇది..!
ABN , First Publish Date - 2023-05-25T19:27:54+05:30 IST
అసలు ఆ చిన్నారి జింకకు ఏం చెప్పిందో.. ఆ జింక ఎలా అర్థం చేసుకుందో చాలా విచిత్రంగా ఉందంటున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించిన వీడియో
చిన్నపిల్లలు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడం ఒకోసారి కష్ఠంగా ఉంటుంది. అలాగే జంతువులు ఏదో చెప్పాలని అరుస్తున్నప్పుడు అవేం చెబుతున్నాయో ఒకపట్టాన అర్థం కావు. కానీ ఈ చిన్నారిని, జింకను చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ చిన్నారి జింకకు ఏం చెప్పిందో.. ఆ జింక ఎలా అర్థం చేసుకుందో చాలా విచిత్రంగా ఉందంటున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
జంతువుల ప్రవర్తన(Animals behave ness), పిల్లల ప్రవర్తన(children's behave ness) చాలా విచిత్రంగా ఉంటుంది. వీడియోలో జపాన్(Japan) దేశానికి చెందిన ఓ చిన్నారి(baby girl) జింకకు(deer) ఎదురుగా నిలబడుకుని ఉంది. ఆ పాప జింకకు జపాన్ పద్దతిలో తల వంచి నమస్కారం చేస్తుంది. ఆ వెంటనే జింక కూడా ఆశ్చర్యంగా తన పొడవాటి కొమ్ములను పైకి కిందకూ ఊపుతూ పాపకు నమస్కారం చేస్తుంది. ఆ వెంటనే పాప తనతో తీసుకొచ్చిన ఆహారం జింక నోటికి అందిస్తుంది(baby gave food to deer). జింక పాపనుండి ఆహారం అందుకున్న తరువాత పాప మళ్ళీ తల కిందకు వంచి జింకకు నమస్కారం చేస్తుంది. జింక కూడా పాపకు కృతజ్ఞతగా(deer gratitude) తిరిగి నమస్కారం చేస్తుంది. చూడ్డానికి చాలా తమాషాగా అనిపించినా ఆ పాపకు, జింకకు మధ్య కమ్యూనికేషన్ అర్థం చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wife: వామ్మో.. ఈ భార్య మాస్టర్ స్కెచ్ మామూలుగా లేదుగా.. భర్త చావుకు కారణమేంటో డాక్టర్లు కూడా తేల్చలేకపోతున్నారు.. అసలు కథేంటంటే..!
ఈ వీడియోను Figen అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. 'ఇద్దరు అమాయకులు వారి భాషలో మాట్లాడుకున్నారు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ పాప జింకను గౌరవించిన విధానం ఆశ్చర్యంగా ఉంటే, ఆ జింక ప్రతిస్పందన మరింత అద్భుతంగా ఉంది' అంటున్నారు. 'ఈ వీడియో మళ్ళీ మళ్లీ చూడాలనిపిస్తోంది' అని కామెంట్స్ చేస్తున్నారు. 'వారిద్దరి అమాయకత్వం ఎంత సున్నితంగా ఉందో' అని మరికొందరు అంటున్నారు. 'ఆ పాప వన్యప్రాణులకు ఎంత గౌరవం ఇస్తోందో' అని పాపను చాలా మెచ్చుకుంటున్నారు.