Viral Video: థియేటర్‌కు వెళ్లిన భార్యాభర్తలు.. సినిమా పూర్తయ్యాక ఏం చేస్తున్నారో చాటుగా వీడియో తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-05-24T17:08:02+05:30 IST

భార్యాభర్తలు సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్ళారు. చూశాక వారు చేస్తున్న పనిని థియేటర్ లో ఉన్న ఒకరు చాటుగా వీడియో తీశారు. ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో..

Viral Video: థియేటర్‌కు వెళ్లిన భార్యాభర్తలు.. సినిమా పూర్తయ్యాక ఏం చేస్తున్నారో చాటుగా వీడియో తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

రోజూ ఇంటి పనులు, ఉద్యోగాల గోలలో మునిగిపోయి భార్యాభర్తలు అలసిపోతుంటారు. వారు తిరిగి బూస్ట్ అవ్వడానికి ఔటింగ్ కు(outing), సినిమాలకు(Movies) వెళుతుంటారు. భార్యాభర్తలు కలసి సినిమాకు వెళ్ళడంలో చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఓ జంట అలాగే సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్ళింది. సినిమా చూశాక వారు చేస్తున్న పనిని థియేటర్ లో ఉన్న ఒకరు చాటుగా వీడియో తీశారు. ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ జంట హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

'మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి' అని సినిమా డైలాగుంది. దానిలాగే భార్యాభర్తలన్నాక(husband and wife) కాస్త సరదాలు, సంతోషాలు(fun and happiness) కూడా ఉండాలి. ఈ కారణంతోనే చాలామంది వీకెండ్ వచ్చినా, సెలవు దొరికినా భాగస్వాములతో కలసి సినిమాకు చెక్కేస్తుంటారు. అయితే సినిమాలు, షికార్లు, సరదాలు కేవలం వయసులో ఉన్నవాళ్ళే ఎంజాయ్ చేస్తుంటారని అందరూ అనుకుంటారు. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులు ఏ రామేశ్వరానికో, కాశీకో వెళ్ళాలని అనుకుంటారు తప్ప సినిమాలకు వెళ్ళాలని అనుకునేవారు తక్కువ. ఓ వృద్ద జంట(old couple) మాత్రం ట్రెండ్ కు తగ్గట్టు సినిమాకు(Old couple went to movie) వెళ్ళింది. సినిమా అయిపోయాక థియేటర్(theator) లో అందరూ తోసుకుని బయటకు వెళ్ళిపోతారని ఆ వృద్ద జంట మాత్రం ఆగిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తరువాత తాతగారు మెట్లు దిగడానికి ఇబ్బంది పడుతోంటే బామ్మగారు తాతగారి చెయ్యి పట్టుకుని మెట్లు దింపుతున్నారు(Old women hold his husband hand). తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా చెయ్యి పట్టి నడిపిస్తుందో అలాగే బామ్మ తన భర్తను నడిపించడం చాలా అందంగా ఉంది. ఈ సంఘటనను థియేటర్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Viral Video: ఇలాంటోళ్లకు ఇలాగే జరగాలి.. కుక్కను హింసిస్తూ కుర్రాళ్ల వికృతానందం.. మరుక్షణంలోనే మైండ్‌బ్లాకయ్యే సీన్..!


ఈ వీడియోను anweshaghosh అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. 'ఫ్రెండ్స్ తో కలసి సినిమాకు వెళ్ళాను, సినిమా అయిపోయాక ఈ అందరమైన దృశ్యం కనిపించింది. అందరూ ఇలాగే ప్రేమగా ఉండాలి' అని మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వృద్ద భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమకు ఫిదా అయిపోయారు. 'శారీరకంగా వారి వయసు ఎంతో తెలియదు కానీ, మానసికంగా వారి వయసు పాతికే' అని చమత్కారం చేస్తున్నారు. బామ్మ తన భర్తను ఎంత జాగ్రత్తగా నడిపిస్తున్నారో పసిపిల్లాడిలాగా అని తాతగారి మీద బామ్మగారికున్న ప్రేమ గురించి కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియో.. సైకిల్‌పై స్కూలుకు వెళ్తూ సడన్‌గా రోడ్డు పక్కన ఆగి.. ఈ పిల్లాడు చేసిన పనేంటో చూస్తే..!


Updated Date - 2023-05-24T17:08:02+05:30 IST