Viral Video: ఈ కుర్చీ అస్సలు విరిగిపోదని నిరూపించాలని.. టైరు కింద పెట్టి ట్రక్కును పోనిచ్చాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-04-15T21:45:53+05:30 IST

'దేవుడా కుర్చీని ట్రక్కు కింద పెట్టడమా! దాని పని అయిపోయినట్టే' అని అంటున్నారు కానీ..

Viral Video: ఈ కుర్చీ అస్సలు విరిగిపోదని నిరూపించాలని.. టైరు కింద పెట్టి ట్రక్కును పోనిచ్చాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ప్లాస్టిక్ సామాన్లు అమ్మే(plastic thing sellers) వీధి వ్యాపారులను గమించారా? వారు తమదగ్గరున్న ప్లాస్టిక్ సామాన్లు అమ్ముడుపోవాలని కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో రకాల టెక్నిక్ లు ప్రదర్శిస్తారు. కొంతమంది తమ వాక్ఛాతుర్యం ఉపయోగిస్తే, మరికొందరు వస్తువు నాణ్యత చూడండంటూ ప్లాస్టిక్ వస్తువులను నేలకేసి కొడతారు. ఓ వ్యక్తి కూడా కుర్చీ అస్సలు విరిగిపోదని నిరూపించాలని ఏకంగా ట్రక్కు టైర్ల కింద కుర్చీని పెట్టి ట్రక్కును పోనిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'దేవుడా కుర్చీని ట్రక్కు కింద పెట్టడమా!' అని కళ్ళు తేలేస్తున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వీధులు తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు అమ్మే వాళ్ళు(street sellers) కస్టమర్లను ఆకర్షించడానికి(attract) రకరకాల పద్దతులు అనుసరిస్తారు. ఓ వ్యక్తి కూడా తన వస్తువులు అమ్ముడుపోవడానికి అనుసరించిన మార్గం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ వ్యక్తి వీధులు తిరుగుతూ ప్లాస్టిక్ కుర్చీలు(plastic chairs) అమ్ముతున్నాడు. ప్రజలకు కుర్చీల నాణ్యత(chair quality) అర్థమైతే కొనడానికి మొగ్గుచూపుతారు. అందుకే తన కుర్చీల నాణ్యత అర్థం కావాలని అతను కుర్చీని ఏకంగా పికప్ ట్రక్కు టైర్(pickup truck tyre) కింద ఉంచాడు. ఆ తరువాత ట్రక్కును ఆ కుర్చీ మీదుగా పోనిచ్చాడు. సాధారణంగా కుర్చీమీద ట్రక్కు వెళితే ఆ కుర్చీ కాళ్లూ చేతులు విరిగిపోవడం ఖాయం. కానీ ఇతను ట్రక్కు కింద పెట్టిన కుర్చీ అలా రబ్బర్ లాగా సాగి దాన్ని తీసి నేల మీద పెట్టగానే మామూలు కుర్చీలా ఉంది.

Wife: భార్యకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఒంటి చేత్తోనే ఆమె విధులు నిర్వహించడం వెనుక..!


ఈ వీడియోను ah0041652 అనే ఇన్ట్రాగ్రామ్ పేజీ(Instagram) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'నాణ్యమైన వస్తువులు పెద్ద పెద్ద షాపుల్లోనూ, బ్రాండ్ నేమ్ తోనూ మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే..' అంటున్నారు. 'కుర్చీలకు ఇంతకంటే బలం ఏం కావాలి?' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'స్ట్రీట్ సెల్లర్స్ తో మామూలుగా ఉండదు మరి' అని ఆ వీధి వ్యాపారి తెలివిని మెచ్చుకుంటున్నారు. 'ఈ కుర్చీ వేరే లెవల్' అని చమత్కరిస్తున్నారు.

కాబోయే భర్తతో రోజూ ఫోన్‌కాల్స్.. నిత్యం చాటింగ్.. కానీ సడన్‌గా అతడి నుంచి నో రెస్పాన్స్.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి ఆ యువతికి షాక్..!


Updated Date - 2023-04-15T21:45:53+05:30 IST