Viral Video: ఓ యువతికి బంపరాఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఒకే ఒక్క వీడియోను చూసి జాబ్ ఇస్తానంటూ ప్రకటన..!
ABN , First Publish Date - 2023-07-10T17:14:49+05:30 IST
ఆనంద్ మహీంద్రా సాదారణ పౌరుల ప్రతిభను ఎలాంటి సంకోచం లేకుండా మెచ్చుకోవడమే కాకుండా వారి ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడూ అలానే..
సోషల్ మీడియాకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆనంద్ మహీంద్రా. కామన్ మ్యాన్ ట్యాలెంట్ ను గుర్తించడంలోనూ , సోషల్ మీడియాలో తనని అనుసరించే వారిని ఇన్స్పైర్ చెయ్యడంలోనూ ఈనెప్పుడూ ముందుంటారు. ఈయన తాజాగా ఓ యువతి ట్యాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యారు. నీ ట్యాలెంట్ మాకు కావాలి. మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తానంటూ సోషల్ మీడియా వేదికగా యువతికి జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఈ యువతికి క్రియేటీవిటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ యువతి ట్యాలెంట్ ఏంటి? ఆనంద్ మహీంద్రా అంతగా ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? పూర్తీగా తెలుసుకుంటే..
ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. వివిధ ప్రాంతాలలో సాదారణ పౌరుల ప్రతిభను ఎలాంటి సంకోచం లేకుండా మెచ్చుకోవడమే కాకుండా వారి ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. ఈయన ఒక వీడియో షేర్ చేశారు. వీడియోలో ఓ మహిళ స్టాప్లర్ పిన్స్(stapler pins) సహాయంతో ఓ చిన్న వెహికల్ ను తయారుచేసింది(making toy car with stapler pins). ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆమె ఈ పిన్స్ ను అతికించడానికి గమ్, ఫెవికల్, హాట్ గ్లూ వంటివి ఏవీ ఉపయోగించలేదు. పొడవుగా ఉన్న స్టాప్లర్ పిన్స్ ను ఒక దానిలో ఒకటి జొప్పిస్తూ వాటిని కంప్రెస్ చేయడం ద్వారా బండి చక్రాలు తయారుచేసింది. ఆ తరువాత ఇదే విధంగా పిన్స్ ను సెట్ చేయడం ద్వారా వెహికల్ సీటర్ బాగాన్ని తయారుచేసింది. రెండింటినీ అమర్చడానికి కూడా ఎలాంటి గమ్ ఉపయోగించలేదు. ఇది తయారుచేయడం పజిల్ లాగా ఉంది. ఆ యువతి పిన్స్ తో కారు మొత్తం తయారుచేసి దాన్ని చేత్తో ముందుకు, వెనక్కు దూకించడం చూడచ్చు.
Health Tips: దేవుడి పూజకు మాత్రమే వినియోగిస్తుంటాం కానీ.. కర్పూరంను ఇలా కూడా వాడచ్చని తెలుసా?
ఈ వీడియో ఆనంద్ మహీంద్రా anand mahindra తన ట్విట్టర్(Twitter) అకౌంట్ లో షేర్ చేసారు. ఈ మహిళ ప్రతిభకు ఈయన ముగ్దుడైపోయాడు. 'ఆమె అంత సింపుల్ గా ఉన్న స్టాప్లర్ పిన్స్ తో ఇంత క్రియేటీవ్ గా ఎలా ఆలోచించగలిగింది? ఇదిచాలా సృజనాత్మకమైనది. ఆమె నిజంగా కార్ల కంపెనీలో పనిచేయాలని అనుకుంటే మేము ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము' అని అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా మహిళ ప్రతిభకు ఇంప్రెస్ అవుతున్నారు. 'ఆమె టెస్లా కార్ల కంపెనీలో డిజైనర్ ఏమో అనిపిస్తోంది' అంటూ ఒకరు సరదాగా సందేహం వ్యక్తం చేశారు. దీనికి చాలా ఓర్పు అలాగే దండిగా స్టాప్లర్ పిన్స్ కావాలి అని మరొకరు అన్నారు. నిజమే నిజంగా చాలా అద్భుతంగా ఉంది అని మరికొందరు అంటున్నారు.