Viral Video:బంజారాహిల్స్ లో బంగారు దోశ.. ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..

ABN , First Publish Date - 2023-02-26T15:39:23+05:30 IST

భాగ్యనగరం బంజారాహిల్స్ లో మెరిసిపోతున్న ఈ బంగారు దోశ

Viral Video:బంజారాహిల్స్ లో బంగారు దోశ.. ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..

మీరు దోశ లవ్వరా.. దోశకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ లిస్ట్ ఉంటారు. నూనెనో నెయ్యినో వేసి ఎర్రగా కాల్చిన దోశను బంగాళాదుంప కూర, కొబ్బరి పచ్చడితో కుమ్మితే జిహ్వ వహ్వా.. అనకుండా ఉండదు. ప్రాంతాలను బట్టి నెయ్యి దోశ, ఎర్రకారం దోశ, కారం పొడి దోశ అంటూ రకాలున్నాయి. దోశల మీద ప్రయోగాలు చేస్తూ పిజ్జా దోశలు, పనీర్ దోశలు, వెజిటబుల్ దోశలు వేస్తున్నవారు ఉన్నారు. అయితే బంగారు దోశ గురించి విన్నారా.. ఇదేదో ఎర్రగా కాలిందని బంగారు దోశ అంటారని మీరు అనుకుంటే దోశ పిండిలో గరిట జారినట్టే.. భాగ్యనగరం బంజారాహిల్స్ లో మెరిసిపోతున్న ఈ బంగారు దోశ వైపు ఓ లుక్కేస్తే..

సాధారణంగా హోటల్ కు వెళ్ళి దోశ తింటే దాని ధర ఎంత ఉంటుంది? బండి మీద అయితే 30 నుండి 50 వరకు, హోటల్ లో అయితే ఓ వంద వరకు ఉంటుంది. అయితే హైదరాబాద్ బంజారాహిల్స్ లో 'హౌస్ ఆఫ్ దోశాస్' అనే రెస్టారెంట్ లో మాత్రం దోశ ధర అక్షరాలా వెయ్యి రూపాయలు. ఈ దోశ అచ్చంగా 24క్యారెట్ గోల్డ్ పూతతో మెరిసిపోతోంది. కాజు కట్లీ కి పైన సిల్వర్ ఫాయిల్ పూత ఎలాగైతే ఉంటుందో అలా ఈ దోశకు పైన గోల్డ్ ఫాయిల్ తో పూత వేస్తున్నారు. రోజుకు కనీసం ఆరు నుండి ఎనిమిది దోశలు అమ్ముడుపోతున్నట్టు హౌస్ ఆఫ్ దోశాస్ నిర్వాహకులు తెలిపారు.

Read also: Smartphone Charging: ఈ నిజం తెలియకపోతే స్మార్ట్‌ఫోన్‌ను వాడటం వృథా.. అసలు చార్జింగ్ ఎంత ఉండాలో.. ఎంతలోపు ఉండకూడదో తెలుసా..?


దోశ ఖరీదు అయినా దీన్ని తినడానికి ఆహారప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ, పుట్నాలు మొదలయిన వాటితో తయారు చేసిన చట్నీలు ఈ దోశ రుచిని మరింత ఇనుమడింపచేస్తున్నాయని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. మరికొందరు తమ యూట్యూబ్ లలోనూ, వ్లోగ్స్ లోనూ ఖరీదైన బంగారు దోశను ఇన్ట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే ఏ ఆడ లేడీస్ అయినా పొరపాటున ఈ దోశతో జ్యువెలరీ చేయించుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకండి.

Updated Date - 2023-02-26T15:39:27+05:30 IST