Viral Video: 'Crow man of India' ఇతని అరుపుకు కాకులన్నీ కట్టకట్టుకుని వచ్చేస్తున్నాయ్..

ABN , First Publish Date - 2023-02-28T14:32:59+05:30 IST

ఒక వ్యక్తి కాకి అరుపును తన గొంతు నుండి దించేస్తున్నాడు. ఫలితంగా ఎక్కడెక్కడినుండో

Viral Video: 'Crow man of India' ఇతని అరుపుకు కాకులన్నీ కట్టకట్టుకుని వచ్చేస్తున్నాయ్..

చైత్రమాసంలో కోయిలలు అరుస్తుంటాయి. మనం వాటిని ఇమిటేట్ చేశామంటే అవి తిరిగి బదులుగా అరుస్తాయి. కొన్నిసార్లు కుక్కపిల్లలు, పిల్లులు కూడా ఇలాగే చేస్తాయి. వాటి అరుపులు ఇమిటేట్ చేయడం ఒక ఆర్ట్ అయితే, ఆ అరుపుకు అవి స్పందించడం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి కాకి అరుపును తన గొంతు నుండి దించేస్తున్నాడు. ఫలితంగా ఎక్కడెక్కడినుండో కాకులన్నీ కట్టకట్టుకుని వచ్చేస్తున్నాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం భోపాల్(Bhopal) లో అక్కు భాయ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాకుల అరుపులో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు స్థానిక గ్రౌండ్ లో నిలబడుకుని కాకిలాగా గట్టిగా అరిచాడు. ఇతని అరుపుకు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎక్కడెక్కడో ఉన్న కాకులు అన్ని ఒక్కొక్కటిగా ఎగురుకుంటూ వచ్చాయి. అవన్నీ ఆకాశాన్ని నింపేశాయి. ట్విట్టర్ లో @kashifkakvi అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుండి ఆసక్తికరమైన స్పందన వస్తోంది. 'ఈ కాకుల ద్వారా ఐకమత్యం అనే విషయాన్ని అందరూ నేర్చుకోవాలి. అక్కు భాయ్ అరుపు విన్న కాకులు ఎక్కడో కాకి ఆపదలో ఉందనే కారణంతో అలా కలసికట్టుగా వచ్చేశాయి. మనుషులు కూడా ఇలాగే యూనిటీగా ఉండాలి' అని ఒకరు చెప్పుకొచ్చారు. ఇంకొందరు అక్కు భాయ్ కాకి అరుపును దించేశాడు భయ్యా అని అతన్ని మెచ్చుకుంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే కాకులు అంతరించిపోతున్న పట్టణ జీవితాల్లో ఇన్ని కాకులు కనిపించడం బాగుందంటున్నారు కొందరు.

Read also: India vs China: చైనాలో షాకింగ్ పరిణామం.. భారత్‌లో ఇలా ఉంటే డ్రాగన్ దేశంలో మాత్రం సీన్ రివర్స్.. అక్కడ కుర్రాళ్లు పెళ్లి చేసుకోవాలంటే..


Updated Date - 2023-02-28T14:32:59+05:30 IST