Viral video: ఓ రైతుకు ఇంతకన్నా ఏమి కావాలి.. పొలంలో నిరాశగా కూర్చుని ఉన్న రైతునుచూసి పెంపుడు జంతువులు ఏమి చేశాయంటే..
ABN , First Publish Date - 2023-06-11T10:39:47+05:30 IST
రైతులు ఆవులను, కుక్కలను ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటారు. అంత ప్రేమగా చూసుకునే రైతులు బాధపడతుంటే అవి ఏమాత్రం భరించలేవు. ఇప్పుడు ఆ విషయం మరొకసారి రుజువైంది. పొలంలో దిగులుగా కూర్చున్న తమ యజమానిని చూసి..
రైతులకు జంతువులకు మధ్య ఉండే అనుబంధం గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆవులను, కుక్కలను ఇంట్లో మనుషులతో సమానంగా చూస్తుంటారు రైతులు.. అంత ప్రేమగా చూసుకునే రైతులు బాధపడతుంటే అవి ఏమాత్రం భరించలేవు. ఇప్పుడు ఆ విషయం మరొకసారి రుజువైంది. పొలంలో దిగులుగా కూర్చున్న తమ యజమానిని చూసి అతని పెంపుడు కుక్కలు, ఆవులు ఏం చేశాయో చూస్తే హృదయం ద్రవిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ప్రతి రైతు(Farmer) తన పొలం పనులలో తనకెంతగానో సహాయపడే ఆవులను(cows), రాత్రి సమయాల్లో పొలాల దగ్గర తనకు తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చే కుక్కలను(Dogs) సొంత మనుషుల్లాగే చూసుకుంటాడు. ఇది కేవలం మనదేశంలోనే కాదండోయ్ విదేశాల్లో కూడా ఇంతే ఉంటుంది. వీడియోలో ఓ రైతు తన పొలంలో(Farm) పనిచేసి అలసిపోయాడు. అతను ఒక్కడే పనిచేయడం వల్లనో లేక పంట గురించి బెంగో తెలియదు కానీ చాలా బాధకు లోనయ్యాడు(farmer feeling sad). దీంతో పొలంలోనే నేల మీద కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని దిగులుగా కూర్చున్నాడు. అతనలా ఉండటంతో పొలంలో ఉన్న అతని రెండు పెంపుడు కుక్కలు అతని దగ్గరకు వెళ్ళి అతన్ని ఉత్సాహపరచాలని చూశాయి(dogs trying to happy their owner). అతనెంతకూ తల పైకి ఎత్తకపోవడంతో వాటికేం చేయాలో వెంటనే తోచలేదు. కానీ ఆ తరువాత అవి అరుస్తూ పొలంలో ముందుకు వెళ్ళి ఆవులను వెంటబెట్టుకొచ్చాయి(dog brought cows along with them). ఆ ఆవులు కూడా తమ యజమాని దిగులుగా కూర్చుని ఉండటంతో బాధపడ్డాయి. అతన్ని పైకి లేపాలని, అతనిలో ఉత్సాహం నింపాలని ఒక ఆవు తన తలతో అతని చేతుల్ని రుద్దుతుంది. అప్పటికీ అతను స్పందించకపోవడంతో మరొక ఆవు అతని దగ్గరకు వెళ్ళి తన తలతో అతన్ని రుద్దుతూ పక్కకు తోస్తుంది. వాటి ప్రయత్నంలో చివరికి అతను తలను పైకి ఎత్తుతాడు. ఆ సమయంలో మిగిలిన ఆవులు కూడా అతని చుట్టూనే ఉండటం గమనించవచ్చు. ఇలా ఆవులు తమ యజమాని నిరాశలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపడాన్ని ఎంతో ప్రయత్నం చేస్తాయి.
Google Pay: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ పే.. కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ ఫీచర్ మీకు పనికొస్తుందో లేదో చెక్ చేసుకోండి..!
ఈ వీడియోను Hakan Kapucu అనే ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జంతువుల ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు. 'చాలా గొప్ప వీడియో' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఈ ప్రకృతి చాలా అద్భుతమైనది, అలాంటి ప్రకృతిని నాశనం చేయాలని చాలామంది చూస్తున్నారు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'కొన్నిసార్లు మనుషులకంటే జంతువులే చాలా నయం' అని ఇంకొందరు అంటున్నారు.'జంతువులు తమ యజమానులను చాలా ప్రేమిస్తాయి' అంటున్నారు.