Viral Video: రైతే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ట్రాక్టర్ ను ఎలా మార్చేశాడో చూస్తే ..
ABN , First Publish Date - 2023-07-31T10:58:29+05:30 IST
భూమి దున్ని పంటలు పండించే రైతే కదా అని ఇతన్ని తేలిగ్గా తీసిపారేయక్కర్లేదు. ఎందుకంటే తన అవసరానికి తగ్గట్టు రైతు కాస్తా శాస్త్రవేత్త రూపం దాల్చాడు. సాధారణ ట్రాక్టర్ ను ఇతను మార్చిన విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..
అక్షరాలు దిద్ది చదువు నేర్చుకోకపోయినా రైతుల శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. శ్రమతో మట్టినుండి ధాన్యం పండించే వీరు ప్రపంచానికంతటికీ కడుపు నింపుతున్నారు. ఇక అంతో ఇంతో టెక్నాలజీ గురించి అవగాహన ఉన్నరైతులు అయితే పంట సాగుకు ఇతర వినియోగానికి కావసినట్టు ఎవరికి వారు కొత్త ఆవిష్కరణంలు చేస్తుంటారు. ఇప్పుడు ఓ రైతు ఆవిష్కరణ అలాగే ఉంది. భూమి దున్ని పంటలు పండించే రైతే కదా అని ఇతన్ని తేలిగ్గా తీసిపారేయక్కర్లేదు. ఎందుకంటే తన అవసరానికి తగ్గట్టు రైతు కాస్తా శాస్త్రవేత్త రూపం దాల్చాడు. సాధారణ ట్రాక్టర్ ను ఇతను మార్చిన విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా రైతు టాలెంట్ చూసి అవాక్కవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
నేటికాలం రైతులు(farmers) శాస్త్రవేత్తలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. తమదగ్గరున్న వస్తువులతోనే తమకు అవసరమైన పరికరాలను ఎంతో తేలిగ్గా తయారుచేస్తారు. వీడియోలో ఓ రైతు రహదారి మీద ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తాడు(farmer make different tractor). అయితే ఆ ట్రాక్టర్ మాత్రం చాలా వినూత్నంగా ఉంది. ఈ ట్రాక్టర్ ఎత్తు, దాని టైర్ల తీరు అంతా కొత్తగా మారిపోయింది. ట్రాక్టర్ ముందు టైర్లు చిన్నవిగా ఉన్నాయి. కానీ వెనుక టైర్లు మాత్రం పెద్దగా ఉన్నాయి. అయితే ఈ టైర్లను అమర్చిన విధానం కొత్తగా ఉంది. టైర్ల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా ట్రాక్టర్ ముందు టైర్లు రెండు తక్కువ గ్యాప్ తో దగ్గరగా ఉంటాయి, వెనుక టైర్లు దూరంగా ఉంటాయి. కానీ ఈ ట్రాక్టర్ కు ఉన్న ముందరి టైర్లు, వెనుక టైర్లు సమాంతరంగా ఉన్నాయి. ఇకపోతే ట్రాక్టర్ ఎత్తు 8-9అడుగులు ఉంది(tractor height 8-9 feet). ఈ ట్రాక్టర్ సహాయంతో చెరువులు, కాలువలు కూడా సులువుగా దాటేయవచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు ట్రాక్టర్ తో ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదని అంటున్నారు.
Health Tips: అకారణంగా జబ్బులు రావడానికి అసలు కారణం ఇదే.. ఏ నెలలో ఏ ఆహారాలు తినకూడదు? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..
ఈ వీడియోను officalbharat__ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ రైతు ఆవిష్కరణ చూసి ఆశ్చర్యపోతున్నారు. 'నేనెప్పుడూ ఇలాంటి ట్రాక్టర్ ను చూడలేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'బాబాయ్ అక్కడ ట్రాక్టర్ ఎక్కడుంది?' అని మరొకరు సరదాగా సెటైర్ వేశారు. 'ఆ ట్రాక్టర్ ఆకాశంలో ప్రయాణం చేస్తున్నట్టుంది' అని ఇంకొకరు అన్నారు. 'ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా సామి' అని మరికొందరు అంటున్నారు.