Viral Video: రైతన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఓ ఖాళీ బీరు బాటిల్‌ను, ఓ మొబైల్ పౌచ్‌ను కలిపి ఇలా చెట్టుకు ఎందుకు వేళాడదీశాడో చూస్తే..
ABN , First Publish Date - 2023-04-10T21:22:58+05:30 IST
ఈ రైతు ట్రిక్కు చూసి 'అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో! ఈ రైతు నిజంగా సూపర్' అంటున్నారు నెటిజన్లు.
టెక్నాలజీని మించిన గొప్ప తెలివితేటలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. సాధారణ వ్యక్తులే వారి అవసరాలకు అనుగుణంగా కనిపెట్టిన వస్తువులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఓ రైతు తన పొలంలో చెట్టుకు ఓ బీర్ బాటిల్, మొబైల్ పౌచ్ ఉపయోగించి అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. ఈ రైతు ట్రిక్కు చూసి 'అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో! ఈ రైతు నిజంగా సూపర్' అంటున్నారు నెటిజన్లు. రైతు తన పొలంలో చెట్టుకు బీర్ బాటిల్, మొబైల్ పౌచ్ వేలాడదీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలింతకూ ఈయన కనిపెట్టిందేంటి? దాని ఉపయోగమేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
కాలం మారే కొద్దీ రైతులు(farmers) కూడా అప్డేట్ అవుతున్నారు. పొలంలో పక్షులు(birds), జంతువుల(animals) బెడద ఉంటుందనే కారణంతో దిష్టిబొమ్మలు పెడుతుంటారు. ఆ దిష్టిబొమ్మలు అచ్చం మనుషుల్లా కనిపిస్తూంటే జంతువులు పొలాల మధ్యలోకి రావడానికి జంకుతాయని అలా చేస్తారు. అయితే దిష్టిబొమ్మలు పెట్టడం పాత పద్దతి. పొలాల్లోకి వచ్చే పక్షులను, జంతువులను బెదరగొట్టడానికి ఓ రైతు కొత్త ప్రయోగం చేశాడు. ఓ ఖాళీ బీర్ బాటిల్(empty beer bottle) ను చెట్టుకు వేలాడదీశాడు. ఆ బాటిల్ కిందుగా మొబైల్ పౌచ్(mobile pouch) ఉండేలా దాన్ని కట్టేశాడు. మొబైల్ పౌచ్ వేలాడదీసిన తాడుకు ఒక ఇనుప నట్(iron nut) బిగించాడు. ఈదురు గాలులకు(speed wind) మొబైల్ పౌచ్ తిరిగి తిరిగి దానికి కట్టేసిన నట్ ను కదిలిస్తుంది. ఆ నట్ బీర్ బాటిల్ మధ్యలో తగులుతూ ఉంటుంది. నట్ తగిలినప్పుడు బీర్ బాటిల్ టంగ్.. టంగ్ అని శబ్దం( it makes ting ting sound) చేస్తోంది. ఆ శబ్దం విన్నప్పుడు పక్షులు, జంతులు ఆ ప్రాంతంలో మనుషులు కాపాలా ఉన్నారనే భయంతో అక్కడినుండి వెళ్లిపోతాయి.
Crime News: మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురు ఎక్కడా కనిపించకపోవడంతో డౌట్.. పక్కింట్లోకి వెళ్లి చూస్తే..
Avadhesh Akodia అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేశారు.ఖాళీ బీర్ బాటిల్, ఇనుప నట్, మొబైల్ పౌచ్ సహాయంతో పొలాల్లో జంతువులను సులభంగా తరిమికొట్టవచ్చు అని ఈ వీడియోకు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ రైతు తెలివికి ఫిదా అవుతున్నారు. 'నువ్వు సూపర్ రైతన్నా పనికిరాని వస్తువులతో ఇంత మంచి ఆవిష్కరణ చేశావు' అని అంటున్నారు. 'పక్షులు జంతువుల దాడితో పంట నష్టం ఎదుర్కొనే రైతులకు నిజంగా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, పైగా ఇది తయారు చేయడం సులభంగానే అనిపిస్తోంది' అని అంటున్నారు నెటిజన్లు. నిజంగా ఈ రైతు తెలివిని మెచ్చుకోవాల్సిందే..